Begin typing your search above and press return to search.
మళ్ళీ పాన్ ఇండియా.. ఈ సారి ఏమౌతుందో!
By: Tupaki Desk | 25 May 2020 5:15 AM GMTఇప్పుడంతా పాన్ ఇండియా సినిమాల కాలం. ప్రతి స్టార్ హీరో.. ప్రతి దర్శకుడు పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కించాలని ముచ్చట పడుతున్నారు. సీనియర్ దర్శకుడు పూరి జగన్నాధ్ కూడా ఇదే బాట పట్టడం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. పూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండతో తెరకెక్కిస్తున్న 'ఫైటర్' పాన్ ఇండియా సినిమానే. హిందీలో కరణ్ జోహార్ విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత కూడా పూరి మరో పాన్ ఇండియా ప్రాజెక్టును లైన్లో పెట్టడం గమనార్హం.
'ఫైటర్' తర్వాత ఓ బాలీవుడ్ అగ్ర హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాకు ఓ పెద్ద ఓటీటీ ప్లాట్ ఫామ్ మద్దతుగా ఉందట. ఈ ప్రాజెక్టు ఫైనలైజ్ చేయడం వెనక వారే ఉన్నారట. అయితే రామ్ గోపాల్ వర్మ లాంటి ఒకరిద్దరికి తప్ప మన టాలీవుడ్ దర్శకులకు బాలీవుడ్ ఎప్పుడూ పెద్దగా కలిసి రాలేదు. బాలీవుడ్ డ్రీమ్స్ మాయలో పడి చాలామంది కెరీర్ అటూ ఇటూ కాకుండా పోయింది. పూరి కూడా గతంలో ఓ బాలీవుడ్ సినిమాకు దర్శకత్వం వహించారు కానీ ఆ సినిమా ఫలితం నిరాశపరిచింది. దాని తర్వాత మరో హిందీ చిత్రం జోలికి పోలేదు.
ఇప్పుడు చాలా కాలం తర్వాత 'ఫైటర్' తో పాన్ ఇండియా ఫిలిం చేస్తుండడం.. వెంటనే మరో హిందీ ప్రాజెక్టును లైన్లో పెట్టడం చూస్తుంటే పూరి ఈ సారి గట్టిగా బాలీవుడ్ లో పాగా వేయాలనే ప్లానింగ్ తో ఉన్నాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అమితాబ్ బచ్చన్ తో సినిమా చేసినప్ప్పుడే పూరికి బాలీవుడ్ అచ్చిరాలేదని టాక్ వినిపించింది. ఇప్పుడు ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులు.. బాలీవుడ్ ప్రయత్నాలు ఫలిస్తాయా.. పూరిని పాన్ ఇండియా డైరెక్టర్ గా మారుస్తాయా అనేది వేచి చూడాలి.