Begin typing your search above and press return to search.

అతనికి అంత ముట్టజెప్పి ఏం లాభం..?

By:  Tupaki Desk   |   1 Sep 2022 11:30 PM GMT
అతనికి అంత ముట్టజెప్పి ఏం లాభం..?
X
ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ ఇటీవలి 'లైగర్' సినిమాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీదకు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ ఫిలింలో మైక్ ఒక స్పెషల్ రోల్ చేసాడు.

'లైగర్' సినిమాతో రౌడీ స్టార్ విజయ్ బాలీవుడ్ లో అడుగుపెడితే.. హిందీ హీరోయిన్ అనన్య పాండే టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో నటించడానికి ప్రపంచ ప్రసిద్ధ మాజీ బాక్సింగ్ ఛాంపియన్ కు భారీ రెమ్యునరేషన్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.

బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం, ఈ చిత్రంలో అతిధి పాత్ర కోసం మైక్ టైసన్ కు రూ. 20 - 25 కోట్లను ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. ఇందులో మైక్ పారితోషకం మరియు అతనికి సంబంధించిన ఇతర ఖర్చులు కూడా ఇన్ క్లూడ్ అయ్యాయని చెబుతున్నారు.

ప్రపంచ బాక్సింగ్ చరిత్రలో ఎన్నో సంచలనాలు సృష్టించిన మైక్ టైసన్.. ఆవేశపరుడిగా గుర్తిండి పోయాడు. తోటి బాక్సర్ హోలీఫీల్డ్ చెవి కొరికి బాక్సింగ్ నుంచి సస్పెండ్ చేయబడిన ఘటనను 80-90స్ జనాలు ఎవరూ మర్చిపోలేరు. కాకపోతే ఈ జనరేషన్ వాళ్లకు అతను పెద్దగా కనెక్ట్ కాలేడు.

మైక్ పై ఉన్న అభిమానంతో పూరీ తన 'లైగర్' సినిమాలో భాగం చేయాలని భావించారు. అయితే ఈ ఆలోచనను కరణ్ జోహార్ తీవ్రంగా వ్యతిరేకించినట్లు బాలీవుడ్ మీడియా పేర్కొంది. పూరీ మాత్రం పట్టుబట్టి బడ్జెట్ ఎక్కువైనా పర్వాలేదని బాక్సింగ్ లెజెండ్ ను ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చారు.

మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యానికి తగ్గట్టుగా దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ ను కీలక పాత్రలోకి తీసుకోవడంతో అందరిలో ఆసక్తి రెట్టింపు అయింది. మూవీ ప్రమోషన్స్ లో సైతం మైక్ ఎపిసోడ్ గురించి 'లైగర్' టీమ్ గొప్పగా చెబుతూ వచ్చింది. అయితే మైక్ కనిపించిన క్లైమాక్స్ పార్ట్ పూర్తిగా నిరాశ పరిచింది.

మైక్ టైసన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని సినీ ప్రియులు ఊహించుకుంటే.. క్లైమాక్స్ మరీ బలహీనంగా రాసుకోవడం వల్ల అతని పాత్ర తేలిపోయింది. మాజీ బాక్సింగ్ ఛాంపియన్ ఉనికి వృథా అయింది.

అసలు ఆ రోల్ కు టైసన్ అవసరమే లేదని.. ఎవరినీ తీసుకున్నా అలానే ఉండేదని ఆడియన్స్ అభిప్రాయ పడ్డారు. అన్ని కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చి మైక్ తీసుకొచ్చినా ఫలితం లేకుండా పోయిందని కామెంట్స్ చేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.