Begin typing your search above and press return to search.
'లైగర్' పోలికలపై స్పందించిన పూరీ..!
By: Tupaki Desk | 23 July 2022 7:42 AM GMT'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్.. ఇప్పుడు ''లైగర్'' చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యారు. సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు 'సాలా క్రాస్ బ్రీడ్' అనేది ట్యాగ్ లైన్. ఇది బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందింది. దర్శక హీరోల కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
'లైగర్' సినిమా వచ్చే నెలలో విడుదల కానున్న నేపథ్యంలో మేకర్స్ శరవేగంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవలే గ్రాండ్ గా ట్రైలర్ ను లాంచ్ చేశారు. దీనికి మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ.. సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. యూట్యూబ్ లో 50 మిలియన్లకు పైగా వ్యూస్ మరియు 1.5+ మిలియన్ లైక్స్ తో ట్రెండింగ్ లో ఉంది.
అయితే ట్రైలర్ చూసిన తర్వాత సోషల్ మీడియాలో నెటిజన్లు 'లైగర్' చిత్రానికి 'అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి' సినిమాతో పోలికలు పెడుతున్నారు. రవితేజ హీరోగా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కథాంశంతో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. 2003 లో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.
'లైగర్' లో విజయ్ మరియు అతని తల్లిగా నటించిన రమ్యకృష్ణ లను.. 'అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి' లో తల్లీకొడుకులుగా చేసిన రవితేజ - జయసుధ పాత్రలతో కంపేర్ చేస్తున్నారు. అక్కడ హీరో తండ్రి లేకుండా పెరిగితే.. ఇక్కడ కూడా హీరో తన తండ్రికి దూరమై తల్లి పెంపకంలో ఎదిగినట్లు తెలుస్తోంది. అందులోనూ ఇద్దరూ బాక్సర్సే కావడం గమనార్హం.
రెండు సినిమాల బ్యాక్ డ్రాప్ మరియు సెటప్ అంతా ఒకేలా ఉండటం.. రెండూ పూరీ డైరెక్ట్ చేసినవే కావడంతో పోలికలు వస్తున్నాయి. కాకపోతే అది రీజనల్ మూవీ అయితే.. దీన్ని పాన్ ఇండియా స్థాయికి తగ్గట్టుగా తీశారని కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై తాజాగా పూరీ స్పందించారు.
లేటెస్టుగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'లైగర్' పూర్తిగా కొత్త సినిమా అని.. తన మునుపటి చిత్రాల నుండి తాను ఎలాంటి విషయాలను తీసుకోలేదని స్పష్టం చేశాడు. ఇది ఎంఎంఏ బ్యాక్ డ్రాప్ లో మంచి లవ్ స్టోరీతో కూడిన పక్కా కమర్షియల్ యాక్షన్ డ్రామా అని తెలిపారు.
కాగా, 'లైగర్' చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కీలక పాత్ర పోషించారు. పూరీ కనెక్ట్స్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరీ జగన్నాథ్ - ఛార్మీ కౌర్ - కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు.
తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషల్లో ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా 'లైగర్' సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన శాటిలైట్ మరియు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను 'స్టార్ గ్రూప్' భారీ మొత్తానికి కొనుగోలు చేసిందని టాక్ వినిపిస్తోంది.