Begin typing your search above and press return to search.
75 వేలతోనే పూరి ఆ సినిమా మొదలుపెట్టాడట!
By: Tupaki Desk | 18 Aug 2022 9:30 AM GMTపూరి జగన్నాథ్ కెరియర్ ను పరిశీలిస్తే ఆయన ఎలాంటి కష్టాలను తట్టుకుని ఎదిగాడో .. నిలబడ్డాడో అర్థమవుతుంది. ఒక వైపున యూత్ ను .. మరో వైపున మాస్ కి సంబంధించిన అంశాలు ఉండేలా చూసుకుంటూ, ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా మెప్పించేలా చూసుకోవడం ఆయన ప్రత్యేకత. చాలా ఫాస్టుగా కథాకాథనాలు తయారు చేయగల సమర్ధుడు ఆయన. ఇక పూరి సంభాషణలు ఆయన సినిమాలకి హైలైట్ గా నిలుస్తూ ఉంటాయి. ఆ మాటలు కావలని రాసినట్టుగా ఉండవు .. చాలా సహజంగా అనిపిస్తాయి. అందువల్లనే ఆడియన్స్ ను వెంటనే కనెక్ట్ అవుతుంటాయి.
పూరి కెరియర్లో హిట్లు ఉన్నాయి .. ఫ్లాపులు ఉన్నాయి. ఆ రెండు విషయాలకు కూడా అంతగా స్పందించని తీరు ఆయనలో కనిపిస్తుంది. ఆ తరువాత సినిమా పైకి ఆయన వెళ్లిపోతుంటాడు. ఒకానొక దశలో పూరి సినిమాలు చేస్తే చాలు అనుకున్న స్టార్ హీరోలు చాలామందినే ఉన్నారు.
ఆ తరువాత ఆయనను తప్పించుకుని తిరిగినవాళ్లూ ఉన్నారు. ఒక వైపున ఆస్తులు పోవడం .. మరో వైపున వరుస ఫ్లాపులు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. అయినా ఆయన తన మనో ధైర్యాన్ని కోల్పోలేదు. కథలపై కసరత్తు చేస్తూనే వెళ్లాడు.
అలాంటి పరిస్థితుల్లో ఉన్న పూరికి 'ఇస్మార్ట్ శంకర్' ఊపిరిని ఇచ్చింది. ఇదీ పూరి మార్క్ మసాలా అంటూ మాస్ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఆ సినిమా ఆయనకి కాసుల వర్షాన్ని కురిపించింది. పూరి మళ్లీ ట్రాక్ లోకి వచ్చేశాడనే అంతా చెప్పుకున్నారు. నిజానికి ఆ సినిమా సమయానికి పూరి దగ్గర అసలు డబ్బులే లేవట.ఆ సినిమా షూటింగు మొదలు పెడదామని అనుకునే సమయానికి ఆయన దగ్గర ఉన్నది కేవలం 75 వేలు మాత్రమేనట. అయినా ఈ సినిమాను చేయవలసిందే అనే ఒక కసితో ఆయన రంగంలోకి దిగాడు.
అప్పటికే ఆయన ఆస్తులు చాలా వరకూ అమ్ముడుకోవడం జరిగింది. ఈ సినిమా కూడా పోతే పరిస్థితి ఏమిటి అనుకున్నవారు ఉన్నారు. ఆయనతో నేరుగా అనేసినవారు ఉన్నారు. ఈ సినిమా నుంచి ఇక అమ్ముకోవడం ఉండదనీ .. కొనడం మాత్రమే జరుగుతుందని పూరి చెప్పాడట.
తన కథపై పూరికి ఎంతనమ్మకం ఉంటుందో .. తన కసిపై ఆయనకి ఉన్న నమ్మకం ఎలాంటిదో దీనిని బట్టి తెలుస్తోంది. ఇక ఆ సినిమా ఏ స్థాయిలో వసూళ్లను రాబట్టిందన్నది తెలిసిందే. ఇక ఆయన తాజా చిత్రంగా ఈ నెల 25వ తేదీన రానున్న 'లైగర్', మరో సంచలనానికి తెరతీస్తుందేమో చూడాలి.