Begin typing your search above and press return to search.
మా అమ్మ మహాలక్ష్మి ఫిక్సయినట్టేనా?
By: Tupaki Desk | 5 Oct 2015 10:30 PM GMTమెగా హీరోల్ని కమర్షియల్ హీరోలు గా నిలబెట్టిన గట్స్ పూరీవే. చరణ్ ని చిరుత తో, బన్నిని దేశముదురు తో కమర్షియల్ హీరోల్ని చేశాడు. ఇప్పుడు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ని కమర్షియల్ హీరో ని చేయాలని తపిస్తున్నాడు. అందుకే అతడి కోసం అమ్మ నాన్న ఓ తమిళమ్మాయ్ లాంటి మదర్ సెంటిమెంట్ ఉన్న కథాంశాన్ని ఎంచుకున్నాడు.
అయితే ఈ సినిమాకి టైటిల్ లోఫర్ అని పెట్టినప్పట్నుంచి జనాల్లో నెగెటివ్ టాక్ వినిపించింది. మెగా ఫ్యామిలీ నుంచి కూడా నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. టైటిల్ మార్చాల్సిందే. బాలేదు అన్న ఒత్తిడి పెరిగింది. చివరికి ఈ సినిమా నిర్మాత, రామ్ గోపాల్ వర్మ అంతటివారే ఈ టైటిల్ మార్చాల్సిందే అంటూ పట్టుబట్టారు. మీడియా లోనూ నెగెటివ్ అనే వినిపించింది. అందుకే చివరకు పూరి తన మనసు మార్చుకున్నాడు. టైటిల్ మార్చేందుకు డిసైడ్ అయ్యాడు. లోఫర్ టైటిల్ ఇప్పుడు ''మా అమ్మ మహాలక్ష్మి'' గా మారుతోంది. ఇప్పటికే పూరి ఈ టైటిల్‌ని ఫిక్సయ్యాడని చెబుతున్నారు. మదర్ సెంటిమెంటుకి తగ్గట్టే ఈ టైటిల్ ని ఎంచుకున్నారు.
వాస్తవానికి ఈ టైటిల్ ని నితిన్ తో సినిమా కోసం అనుకున్నా సెట్స్ కెళ్లలేదు కాబట్టి ఇప్పుడు అదే టైటిల్ ని వరుణ్ కోసం వాడేస్తున్నారట. ఒక దొంగ జీవితాన్ని తెరపై చూపిస్తున్నాడు. అయితే ఆ దొంగకు అమ్మతో ఉండే అనుబంధాన్ని తెరపై ఆవిష్కరిస్తున్నాడు.. దీన్నిబట్టి లోఫర్ కి తల్లిగా ఆ అమ్మపై ఎన్ని నిందలు పడ్డాయో.. ఎన్ని కష్టాలు పడిందో.. ఊహిస్తేనే కష్టం. డిసెంబర్ లో ఈ చిత్రం రిలీజవుతుంది. అంతవకూ వేచి చూడాల్సిందే.