Begin typing your search above and press return to search.
ఓహో! పూరి పాటేసుకున్నాడండోయ్!
By: Tupaki Desk | 21 Dec 2019 5:04 AM GMTడ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చాలా వేగంగా సినిమాలు తీస్తాడనే పేరుంది. అంతే కాకుండా డైలాగ్స్ రాయడంలో.. కథను నేరేట్ చేయడంలోనూ.. టాలీవుడ్ టాప్ డైరెక్టర్లందరిలో ఆయన శైలి ప్రత్యేకమైనది. అయితే ఆయన ప్రతిభ ఇంతవరకే పరిమితమా? అంటే.. ఇకపై లిరిసిస్టుగానూ రాణించేస్తున్నారట.
పూరి లేటెస్టుగా మరో కొత్త అవతారం ఎత్తారన్నది వేడెక్కిస్తోంది. ఇన్నాళ్లు ఆయన తెరపై కథానాయకుడి చేత బలమైన పంచ్ డైలాగ్ లు పలికించడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నారు.. అప్పుడప్పుడు అవసరం మేర పాటలు పాడారు. బ్యాక్ గ్రౌండ్ వాయిస్ కోసం గొంతు కలిపారు. కానీ ఏనాడూ పాటలు మాత్రం రాయలేదు. మొదటిసారి తనయుడు ఆకాష్ పూరి కోసం పాటల రచయితగా మారిపోయారట. ఆకాష్ పూరి హీరోగా `రొమాంటిక్` పేరు తో ఓ రొమాంటిక్ లవ్‌స్టోరీ ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పూరితో కలిసి చార్మి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిల్ పాదురి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇటీవల విడుదల చేసిన రొమాంటిక్ ఫస్ట్ లుక్ కి మంచి స్పందన లభించింది. వరుస పోస్టర్లతో అంతకంతకు హీట్ పెంచుతున్నాడు పూరి. `నువ్వు నేను ఈ క్షణం` అనే పాటని ఈ రోజు సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. అయితే మనకు ఇంత వరకే తెలుసు.. ఈ పాటకు ఉన్న అసలు విశేషం తాజాగా బయటపడింది. ఈ పాటను తనయుడి కోసం స్వయంగా పూరి జగన్నాథ్ రాసారట. హీరో.. హీరోయిన్ల ను తన సినిమాల్లో సాధ్యమైనంత రొమాంటిక్ గా చూపించే పూరి తన పాటతో మరింత రొమాంటిక్ ట్రీట్ ని ఇస్తున్నారట. ఉత్తరాది హాటీ కేతికా శర్మ ఈ పాటలో తన అందాల్ని యూత్ కి ఎరగా వేయబోతోందట. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని కొత్త సంవత్సరంలో రిలీజ్ చేయనున్నారు. అంతా బాగానే ఉంది కానీ.. పూరీ ఇలా కలాన్ని ఝలిపించి యుగల గీతాల్ని.. ప్రణయ గీతాల్ని తనదైన శైలి లో రాసేస్తుంటే ఉపాధి కోల్పోయిన ఆస్థాన విధ్వాంసుడు భాస్కరభట్ల ఫీలవుతారేమో పూరీ సర్?