Begin typing your search above and press return to search.

పూర్ణని మోసం చేసింది ఎవరంటే..

By:  Tupaki Desk   |   22 Feb 2016 4:02 AM GMT
పూర్ణని మోసం చేసింది ఎవరంటే..
X
యాక్టర్స్ ఒక్కొక్కరి బాధ ఒక్కోలా ఉంటుంది. కొందరికి ట్యాలెంట్ ఉండి అవకాశాలు రావు. అవకాశాలొచ్చిన వారు ట్యాలెంట్ లేక కనుమరుగవ్వాల్సి వస్తుంది. కానీ తనకు ట్యాలెంట్ ఉన్నా.. ఉపయోగించుకోవడం లేదని, పైగా మోసం చేసేస్తున్నారని హీరోయిన్ పూర్ణ తెగ బాధపడిపోతోంది. అయితే.. ఈమెను మోసం చేసింది మనోళ్లు కాదు లెండి.. ఈమె బేసిక్ గా మళయాళీ భామ. తన సొంత ఇండస్ట్రీయే తనను చీట్ చేసిందని చెబుతోంది.

పూర్ణకి మలయాళంలో కంటే తెలుగు -తమిళ్ లోనే ఆఫర్స్ ఎక్కువగా ఉన్నాయి. సొంత పరిశ్రమలో సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపి.. కొన్ని ప్రాజెక్టులు చేస్తే, వాళ్లేమో మోసం చేస్తున్నారట. స్టోరీ - స్క్రిప్ట్ చెప్పినపుడు పెద్ద రోల్ అని, ఇంపార్టెంట్ కేరక్టర్ అని చెప్పి.. తీరా సినిమా విడుదలయ్యాక చూస్తే కొన్ని నిమిషాలకే పరిమితం చేసేస్తున్నారట. దీంతో అసలు మల్లూవుడ్ మూవీస్ చేయడం మానేద్దామన్నంత కసి వచ్చేస్తోందట పూర్ణకి.

ఇక రూమర్స్ విషయంలో ఈ భాగా తెగ ఫీలయిపోతోంది. తను నటించిన ఓ హారర్ సినిమా చూస్తే ఎవరో చనిపోతే, తన కారణంగానే అని ప్రచారం చేయడం బాధ కలిగించిందట. అలాగే ఓ మూవీలో ప్రెగ్నెంట్ పాత్రను పోషిస్తే.. పూర్ణకి ప్రెగ్నెన్సీ అంటూ ప్రచారం చేసేశారట. ఇప్పుడు తనకు 30ఏళ్లు రావడంతో.. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని కూడా చెబుతోంది పూర్ణ.