Begin typing your search above and press return to search.
`పుష్ప 2`.. ఈ లెక్కలు తెలుసా?
By: Tupaki Desk | 1 Aug 2022 2:30 AM GMT`పుష్ప ది రైజ్` తో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఒకే ఒక్క మూవీతో దేశ వ్యాప్తంగా తన పేరు మారుమోగేలా చేశాడు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 360 కోట్లకు మించి వసూళ్లని రాబట్టింది. హిందీలోనూ రికార్డులు సృష్టించింది.
త్వరలో ఈ మూవీకి సీక్వెల్ గా `పుష్ప 2` సెట్స్ పైకి రానున్న విషయం తెలిసిందే. ఆగస్టులో సెట్స్ పైకి రానున్న ఈ సినిమా బడ్జెట్ ఇప్పడు చర్చనీయాంశంగా మారింది. `పుష్ప ది రైజ్` గా రూపొందనున్న ఈ మూవీ కోసం ఏకంగా మేకర్స్ రూ. 350 కోట్లు ఖర్చు చేయబోతున్నారట. దక్షిణాదిలో తెరపైకి రాబోతున్న మరో భారీ బడ్జెట్ మూవీగా `పుష్ప 2 `నిలబోతోంది. `పుష్ప` హిందీతోనూ భారీ వసూళ్లని రాబట్టడంతో `పుష్ప 2`పై కూడా అంచనాలున్నాయి. ఈ విషయాన్ని గమనించిన హీరో అల్లు అర్జున్ పార్ట్ 2 విషయంలో తన పారితోషికాన్ని రికార్డు స్థాయిలో పెంచినట్టుగా గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
దర్శకుడు సుకుమార్ కూడా భారీగానే డిమాండ్ చేస్తున్నారట. దీనికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త తాజాగా బయటికి వచ్చింది. అల్లు అర్జున్ పార్ట్ 2 కు గానూ ఏకంగా రూ. 125కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నారట. ఇక దర్శకుడు సుకుమార్ కూడా భారీగానే పెంచేశారని, ఆయన రూ. 75 కోట్ల మేర డిమాండ్ చేస్తున్నారని తెలిసింది. దీంతో ఇద్దరి రెమ్యునరేషనే ఏకంగా రూ. 200 కోట్లు అవుతోందని ఇన్ సైడ్ టాక్. సినిమా బడ్జెట్ కోసం రూ. 350 కోట్ల బడ్జెట్ లో ప్రచార ఖర్చులతో కలిపి రూ.150 కోట్లు మాత్రమే ఖర్చు చేయబోతున్నారట.
మిగతా మొత్తం హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ ఖాతాలోకి వెళ్లనుందని వార్తలు వినిపిస్తున్నాయి. మేకర్స్ కు ఇది నిజంగా షాకింగ్ న్యూసే అయినా హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ డీల్ కు ఎదురుచెప్పలేని పరిస్థితి. ఇక దీనికి తోడు మేకర్స్ కి మరో డిమాండ్ ని కూడా పెట్టారట. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్, నాన్ థియేట్రికల్ బిజినెస్ ని కూడా స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాత్రమే చూసుకుంటారని, ఆయనని కాదని ఎలాంటి డీల్స్ పెట్టుకోవద్దని బన్నీ కండీషన్ గా తెలుస్తోంది.
ఇదిలా వుంటే మేకర్స్‌కి బన్నీ, సుక్కు మరో షాక్ ఇచ్చారట. ఈ మూవీకి వచ్చే లాభాల్లో ఈ ఇద్దరికి 40 శాతం వాటా ఇవ్వాలన్నది తాజా కండీషన్ గా వినిపిస్తోంది. ఒన్న కండీషన్ లతో సెట్స్ పైకి రానున్న `పుష్ప 2` ఇప్పడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఆగస్టులో ప్రారంభం కానున్న ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట. ఈ ఒప్పందం కారణంగా షూటింగ్ ని ఫాస్ట్ గా పూర్తి చేస్తానని దర్శకుడు సుకుమార్ మేకర్స్ కి హామీ ఇచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.