Begin typing your search above and press return to search.

పుష్ప కోసం బన్నీ అక్కడకు... పుష్ప 2 మరింత ఆలస్యం

By:  Tupaki Desk   |   19 Nov 2022 5:34 AM GMT
పుష్ప కోసం బన్నీ అక్కడకు... పుష్ప 2 మరింత ఆలస్యం
X
అల్లు అర్జున్‌ పుష్ప సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రికార్డు బ్రేకింగ్ వసూళ్లను నమోదు చేసిన విషయం తెల్సిందే. అంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న పుష్ప కు సీక్వెల్ గా రూపొందబోతున్న పుష్ప 2 సినిమా ఎప్పుడెప్పుడు షూటింగ్‌ ప్రారంభం అవుతుందా అంటూ ఈ ఏడాది ఆరంభం నుండి కూడా అల్లు అర్జున్‌ యొక్క అభిమానులు మరియు ప్రేక్షకులు వెయిట్‌ చేస్తున్నారు.

పుష్ప 2 సినిమా కోసం దర్శకుడు స్క్రిప్ట్‌ ను రెడీ చేసేందుకు కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సోషల్‌ మీడియాలో ఈ విషయమై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఎంత ఆలస్యం అయితే అంత మంచి ఔట్‌ పుట్‌ వస్తుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఎట్టకేలకు పుష్ప 2 ప్రారంభం అయ్యింది అంటూ ఇటీవలే ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం అందింది. వచ్చే ఏడాది చివరి వరకు సినిమాను కచ్చితంగా విడుదల చేయడం ఖాయం అని అనుకుంటున్న సమయంలో బన్నీ మళ్లీ మళ్లీ సినిమా షూటింగ్‌ కు అంతరాయం కలిగిస్తున్నాడు అంటూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

షూటింగ్‌ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి అంటూ ప్రచారం జరుగుతున్న సమయంలోనే బన్నీ ఫ్యామిలీ తో ఆఫ్రికా కు వెళ్లిన విషయం తెల్సిందే. అక్కడ నుండి తిరిగి వచ్చిన బన్నీ ఇకనైనా పుష్ప 2 షూటింగ్‌ లో జాయిన్ అవుతాడేమో అనుకుంటూ ఉండగా పుష్ప 1 కోసం రష్యా రాజధాని మాస్కో కు వెళ్లబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

అక్కడ ప్రతిష్టాత్మక ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జరగబోతుంది. అక్కడ పుష్ప 1 సినిమాను స్క్రీనింగ్‌ చేసే అవకాశం దక్కింది. అందుకే అక్కడకు నిర్మాతలతో పాటు హీరో బన్నీ కూడా వెళ్తున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ఒక వేళ బన్నీ మాస్కో కు వెళ్తే పుష్ప 2 సినిమా షూటింగ్‌ మరింత ఆలస్యం అవుతుంది.

ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే పుష్ప 2 సినిమా 2023 సంవత్సరంలో రావడం అనుమానమే అన్నట్లుగా ఇప్పటికే కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బన్నీ టీమ్‌ పుష్ప 2 ను 2022 లో విడుదల చేస్తాం అన్నట్లుగా ఒక ప్రకటన ఇవ్వాలని.. సినిమా అప్‌డేట్‌ ఇవ్వాలంటూ ఇటీవల అభిమానులు గీతాఆర్ట్స్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగిన విషయం తెల్సిందే. అయినా కూడా బన్నీ. . సుకుమార్‌ నుండి స్పందన లేదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.