Begin typing your search above and press return to search.

పుష్ప 2 ఐటం సాంగ్‌.. రాంగ్‌ సెలక్షన్‌ చేయబోతున్నారా?

By:  Tupaki Desk   |   27 Sep 2022 8:33 AM GMT
పుష్ప 2 ఐటం సాంగ్‌.. రాంగ్‌ సెలక్షన్‌ చేయబోతున్నారా?
X
అల్లు అర్జున్‌.. సుకుమార్ కాంబినేషన్‌ లో వచ్చిన పుష్ప సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా ఏ మాత్రం ప్రమోషన్ లేకుండా ఉత్తర భారతంలో వంద కోట్లకు పైగా పుష్ప వసూళ్లు రాబట్టుకోవడానికి ప్రధాన కారణం సినిమాలోని సాంగ్స్‌.. మరీ ముఖ్యంగా ఐటెం సాంగ్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ప్రస్తుతం పుష్ప 2 ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతున్న విషయం తెల్సిందే. సౌత్‌ ఆడియన్స్ తో పాటు నార్త్‌ ఆడియన్స్ ని కూడా యాక్షన్ తో పాటు అన్ని విధాలుగా ఎంటర్‌ టైన్‌ చేసేలా సినిమా ఉండాలని సుకుమార్‌ కాస్త ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు. ముందుగా అనుకున్న ప్రకారం ఈ ఏడాది ఆరంభంలోనే షూటింగ్‌ ప్రారంభించి ఇదే ఏడాది డిసెంబర్‌ లో పుష్ప 2 విడుదల చేయాల్సి ఉంది.

కానీ పుష్ప భారీ విజయం తర్వాత ప్రతి విషయాన్ని కూడా ఒకటికి రెండు సార్లు కాదు.. నాలుగు అయిదు సార్లు ఆలోచించి మరీ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ సమయంలో పుష్ప 2 ఐటెం సాంగ్‌ కోసం రాంగ్‌ సెలక్షన్‌ చేయబోతున్నారు అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అల్లు అర్జున్ అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు కూడా ఆ విషయమై చర్చించుకుంటున్నారు.

ఇంతకు విషయం ఏంటంటే... పుష్ప 2 సినిమాలో ఐటం సాంగ్‌ ను చందమామ బ్యూటీ కాజల్ అగర్వాల్‌ తో చేయించాలని భావిస్తున్నారు.. ఆమెతో ఇప్పటికే చర్చలు జరిగాయి అనేది ప్రచారం. ఈ విషయం పై చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి ఎలాంటి స్పష్టత లేదు. కేవలం పుకారు గా మాత్రమే ఈ విషయం తెగ చక్కర్లు కొడుతోంది. అయినా కూడా బన్నీ ఫ్యాన్స్ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం అంటున్నారు.

పుష్ప లో సమంత తో ఐటెం సాంగ్ చేయించారు. ఊ అంటావా పాటకు సమంత మాస్.. హాట్‌ స్టెప్పులు ప్రతి ఒక్కరిని రెచ్చగొట్టాయి అనడంలో సందేహం లేదు. అలాంటిది పుష్ప 2 యొక్క ఐటం సాంగ్ అంతకు మించి ఉండాలి కదా అంటూ బన్నీ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ తో ఐటం సాంగ్‌ చేయించే నిర్ణయం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఒక వేళ నిజంగానే సుకుమార్‌ పుష్ప 2 ఐటెం సాంగ్‌ కోసం కాజల్ అగర్వాల్ ని ఎంపిక చేస్తే మాత్రం కచ్చితంగా అది రాంగ్‌ సెలక్షన్‌ అవుతుంది అనడంలో సందేహం లేదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.