Begin typing your search above and press return to search.
బన్నీ కోసం ఆ ఫైట్ లో సుక్కు ఇన్ని మార్పులు చేశాడా?
By: Tupaki Desk | 3 Nov 2022 1:30 PM GMTఅల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ ల కలయికలో తెరపైకి రానున్న `పుష్ప2` అప్పెప్పుడు సెట్స్ పైకి వెళుతుందా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వచ్చే వారం ఈ మూవీ పట్టాలెక్కబోతోంది. `పుష్ప`ని కరోనా భయాల నేపథ్యంలో టీమ్ హరీ బరీగా రిలీజ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో పార్ట్ 2పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే దర్శకుడు సుకుమార్ `పుష్ప2` ని మరిన్ని ప్రత్యేకతలతో భారీ స్థాయిలో సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ తో తెరపైకి తీసుకురాబోతున్నారట.
గత కొన్ని నెలలుగా ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో క్లారిటీ లేకపోవడంతో బన్నీ అభిమానులు కొంత అసహనానికి గురయ్యారు. ఇటీవల బన్నీపై ప్రత్యేక ఫొటోషూట్ తో పాటు టెస్ట్ షూట్ ని కూడా సినిమాటోగ్రాఫర్ మిరోస్లా కూబా బ్రోజెక్ నిర్వహించడం, ఆ ఫొటోలని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో అవి నెట్టింట వైరల్ గా మారాయి. ఫస్ట్ పార్ట్ తో బోంచ్ మార్క్ ని సెట్ చేసిన `పుష్ప`ని దృష్టిలో పెట్టుకుని `పుష్ప2` విషయంలో దర్శకుడు సుకుమార్ భారీ మార్పులు చేశాడట.
కథ, కథనాల్లో.. కీలక ఘట్టాల్లోనూ భారీ మార్పులు చేసినట్టుగా తెలుస్తోంది. అంతే కాకుండా రిసెంట్ గా విడుదలై దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి రికార్డు స్థాయిలో వసూళ్లని రాబట్టిన సినిమాలని దృష్టిలో పెట్టుకుని పలు రోమాంచిత యాక్షన్ ఘట్టాలని ప్రత్యేకంగా డిజైన్ చేశారట సుకుమార్. ఇందులో భాగంగానే అల్లు అర్జున్ పై రియల్ పులితో టెర్రిఫిక్ ఫైట్ ని ప్లాన్ చేశారట. ఇందుకు సంబంధించిన వార్త ఇటీవల బయటికి వచ్చిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా మరో అప్ డేట్ బయటికి వచ్చేసింది. సినిమాలో `RRR`లో ఎన్టీఆర్ పులి ఫైట్ ని తలదన్నే రేంజ్ లో ఈ ఫైట్ ని ప్రత్యేకంగా ప్లాన్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈ పులి ఫైట్ ఓ రేంజ్ లో వుంటుందని, పులి బారి నుంచి తన వర్గాన్ని కాపాడుకుంటూనే పులిని బన్నీ అంతం చేస్తాడని ఇది సినిమాకే ప్రధాన హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు.
ఇదిలా వుంటే ఈ నెల 8 నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలు రానుందని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చక చకా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. డ్రాగన్ ప్రకాష్ నేతృత్వంలో భారీ యాక్షన్ ఎపిసోడ్ ని ప్లాన్ చేస్తున్నారట. ఇందు కోసం ఓ భారీ సెట్ ని కూడా నిర్మించినట్టుగా తెలుస్తోంది. అన్నీ అనుకూలంగా కుదిరితే ఈ మూవీని వచ్చే ఏడాది డిసెంబర్ లో లేదా 2024 సంక్రాంతి బరిలో దింపాలని సుకుమార్చ బన్నీ ప్లాన్ చేస్తున్నారట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.