Begin typing your search above and press return to search.

పుష్ప 2.. శ్రీవల్లి ని మరింత బలంగా చూస్తామా?

By:  Tupaki Desk   |   23 Aug 2022 11:30 PM GMT
పుష్ప 2.. శ్రీవల్లి ని మరింత బలంగా చూస్తామా?
X
అల్లు అర్జున్‌ పుష్ప సినిమా పార్ట్‌ 2 పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో సినిమా ప్రారంభం అవ్వాల్సి ఉండగా స్క్రిప్ట్‌ ను మరింత బలంగా.. సినిమాలోని పాత్రలను మరింత ప్రభావితంగా చూపించడం కోసం దర్శకుడు సుకుమార్‌ స్క్రిప్ట్‌ వర్క్ కు కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు. పుష్ప 2 లోని ప్రతి పాత్రను కూడా అభిమానులు అంతకు మించి అన్నట్లుగా ఊహించుకుంటున్నారు.

పుష్ప రాజ్ ను మొదటి పార్ట్‌ లో ఒక సామాన్య కూలీ గా చూపించిన దర్శకుడు సుకుమార్‌ రెండవ పార్ట్‌ లో ఎలా చూపించబోతున్నాడా అనే ఆసక్తి అందరిలో కనిపిస్తుంది. ఇక సునీల్‌ మరియు అనసూయ పాత్రల విషయంలో కూడా అదే ఆసక్తి నెలకొంది. ఈ సమయం లోనే రష్మిక మందన్నా పాత్ర పై అంచనాలు మరింత పెరిగాయి. పుష్ప మరియు శ్రీవల్లిల పెళ్లి పుష్ప పార్ట్‌ 1 లో జరిగింది.

పార్ట్‌ 2 లో పుష్ప యొక్క భార్య గా శ్రీవల్లి కనిపించబోతుంది. ఆమె పాత్ర సాదాసీదాగా ఉంటే కచ్చితంగా ఆమె అభిమానులు ఒప్పుకోరు. అందుకే సుకుమార్‌ ఆమె పాత్రను కథలో భాగస్వామ్యం చేసి మరింత పవర్ ఫుల్‌ గా చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తాజాగా సినిమా పూజా కార్యక్రమాలు జరిగిన సందర్భంగా పుష్ప మళ్ళీ రాబోతున్నాడు అంటూ రష్మిక సోషల్‌ మీడియా ద్వారా ఆ ఫోటోలను షేర్‌ చేసింది.

ఆ ఫోటోలు షేర్ చేసిన రష్మిక మందన్నా పోస్ట్‌ కి ఒక అభిమాని స్పందిస్తూ.. ఒక రిక్వెస్ట్‌ ఏంటీ అంటే సినిమాలో రష్మిక మందన్నా పాత్ర మరింత పవర్‌ ఫుల్‌ గా ఉండాలి.. అలాగే దనంజయ్‌ పాత్ర ఎలా ఉంటుందా అంటూ ఆసక్తిగా ఉన్నామంటూ పుష్ప పార్ట్‌ 2 ప్రారంభం సందర్భంగా తన ఆనందంను ఈమోజీస్ రూపంలో సదరు అభిమాని షేర్‌ చేశాడు.

అతడి యొక్క కామెంట్‌ కు రష్మిక మందన్నా స్పందించింది. తప్పకుండా శ్రీవల్లి పాత్ర ఈ సారి అంతకు మించి అన్నట్లుగా ఉంటుందని ఆశిద్దాం అంటూ అంచనాలు మరింత పెంచింది.

సినిమా లోని ప్రతి పాత్రను కూడా అద్భుతమైన స్క్రీన్‌ ప్లే తో దర్శకుడు సుకుమార్‌ నడిపించే తీరు తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుంది అంటూ బన్నీ అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు పుష్ప 2 కోసం వెయిట్‌ చేస్తున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్‌ ప్రారంభం కాబోతున్న పుష్ప 2 ను వచ్చే ఏడాది సమ్మర్ లో లేదా కాస్త అటు ఇటుగా దసరాకు అయినా విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.