Begin typing your search above and press return to search.

పుష్ప 2 రేంజ్ మామూలుగా లేదు.. షూటింగ్ కి ముందే నెం.1

By:  Tupaki Desk   |   14 March 2022 5:51 AM GMT
పుష్ప 2 రేంజ్ మామూలుగా లేదు.. షూటింగ్ కి ముందే నెం.1
X
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దాదాపు రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన పుష్ప సినిమాకు ప్రస్తుతం సీక్వెల్ పుష్ప 2 రూపొందుతున్న ఈ నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. పుష్ప సినిమా హిందీ వెర్షన్ వంద కోట్లకు పైగా వసూలు సాధించడంతో రెండవ పార్ట్‌ కూడా అక్కడ భారీగా వసూళ్లు సొంతం చేసుకుంటుందనే నమ్మకంను ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు.

అందుకే ఉత్తరాదిన విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హిందీ థియేట్రికల్‌ డబ్బింగ్ రైట్స్ కోసం ఏకంగా వంద కోట్లకు పైగా ఆఫర్ చేస్తున్నారట ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ. హిందీలో పుష్ప పార్ట్-2 భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఆ నిర్మాణ సంస్థ సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఇక పుష్ప నాన్‌ థియేట్రికల్ రైట్స్ ద్వారా అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు ఈ సినిమాను ఏకంగా 300 కోట్లకు పైగా పెట్టి శాటిలైట్ మరియు డిజిటల్ రైట్స్ కొనుగోలు చేశారని తెలుస్తోంది.

ఇప్పటి వరకు ఏ సినిమా కూడా ఈ స్థాయిలో నాన్‌ థియేట్రికల్ రైట్స్ బిజినెస్ దక్కించుకోలేదు అంటూ ట్రేడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ విషయమై ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. కానీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు ఈ సినిమా ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అంత భారీ మొత్తంలో ఖర్చు పెట్టేందుకు సిద్దం అయ్యారని సమాచారం అందుతోంది.

ఇంకా సినిమాకు సంబంధించిన ఈ డీల్‌ పూర్తి అవ్వలేదని.. ముందు ముందు మరింతగా ఈ అమౌంట్‌ పెరిగే అవకాశాలు లేకపోలేదని టాక్ వినిపిస్తోంది. షూటింగ్ కూడా ప్రారంభం కాకుండానే ఈ స్థాయిలో సినిమాకు బిజినెస్‌ జరిగింది అంటే విడుదల సమయంలో ఏ స్థాయిలో ఈ సినిమాకు సంబంధించి హడావుడి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

ఈ సినిమా నాన్‌ థియేట్రికల్ రైట్స్ ఈ స్థాయిలో అమ్ముడు పోతే థియేట్రికల్ రైట్స్ కూడా అంతకు మించి ఉండే అవకాశాలు లేకపోలేదు. ఇంకా ఇతర రైట్స్ ద్వారా కూడా నిర్మాతలకు భారీగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి పుష్ప 1 కంటే పుష్ప 2 మరింత భారీ వసూళ్లను మరియు బిజినెస్ దక్కించుకోవడం ఖాయం అంటూ అప్పుడే క్లారిటీ వచ్చేసింది.

అల్లు అర్జున్ ఈ సినిమాలో ఎలా కనిపించబోతున్నాడు అనేది మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఎర్ర చందనం దొంగ గా బన్నీ కనిపించాడు. రెండవ పార్ట్‌ లో గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. రెండవ పార్ట్‌ లో కూడా రష్మిక మందన హీరోయిన్ గా కొనసాగుతుంది. అయితే ఐటమ్ సాంగ్ ని సమంత కాకుండా మరో స్టార్ హీరోయిన్ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.