Begin typing your search above and press return to search.
పుష్ప 2 : రెమ్యూనరేషన్స్.. బడ్జెట్ హాట్ టాపిక్
By: Tupaki Desk | 23 Aug 2022 6:16 AM GMTఅల్లు అర్జున్.. సుకుమార్ ల కాంబోలో రూపొందిన పుష్ప సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాదాపుగా 400 కోట్ల వసూళ్లను పుష్ప 1 రాబట్టడంతో పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా సినిమాను దర్శకుడు సుకుమార్ భారీ ఎత్తున తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. పుష్ప 1 బడ్జెట్ తో పోల్చితే పుష్ప 2 బడ్జెట్ రెట్టింపు కంటే ఎక్కువగానే అవ్వబోతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
పుష్ప 2 కోసం అల్లు అర్జున్ వంద కోట్లకు పైగానే పారితోషికంగా అందుకోబోతున్నారు అనేది గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇప్పుడు ఈ సినిమా కోసం దర్శకుడు సుకుమార్ దాదాపుగా 60 కోట్ల పారితోషికం ను అందుకోబోతున్నారు అంటూ టాక్ వినిపిస్తుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో 50 కోట్లను మించి పారితోషికం తీసుకుంటున్న దర్శకుల జాబితాలో సుకుమార్ పుష్ప 2 తో చేరి పోయాడు.
రాజమౌళి మరియు త్రివిక్రమ్ లు మాత్రమే ఇప్పటి వరకు ఇండియన్ దర్శకుల్లో 50 కోట్లకు మించి తీసుకున్నారు. ఇప్పుడు సుకుమార్ కూడా ఆ జాబితాలో చేరాడు అంటూ టాక్ వినిపిస్తుంది. పుష్ప 2 లో హీరోయిన్ గా నటించబోతున్న రష్మిక మందన్నా కు నాలుగు నుంచి అయిదు కోట్ల పారితోషికం ను ఇవ్వబోతున్నారట. అలాగే దేవి శ్రీ ప్రసాద్ కూడా ఈ సినిమా కోసం భారీగానే ఛార్జ్ చేయబోతున్నాడట.
మొత్తంగా ఈ సినిమా ను మైత్రి మూవీ మేకర్స్ వారు 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించేందుకు గాను సిద్ధం అయ్యారని తెలుస్తోంది. సినిమా పూజా కార్యక్రమాలు తాజాగా అధికారికంగా నిర్వహించారు. ఆ సమయంలోనే సినిమా కు సంబంధించిన బడ్జెట్ వ్యవహారాల గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది.
మొదటి పార్ట్ కేవలం థియేట్రికల్ రిలీజ్ తో 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. కనుక ఆ స్థాయి బడ్జెట్ ను పెట్టడం వల్ల నష్టం ఏమీ ఉండకపోవచ్చు. పుష్ప 2 సినిమా ను కొందరు కేజీఎఫ్ 2 రేంజ్ లో పోల్చుతున్నారు. కనుక వెయ్యి కోట్ల వరకు పుష్ప 2 రాబట్టిన ఆశ్చర్యం లేదు. అందుకే 350 కోట్ల నుండి 400 కోట్ల వరకు బడ్జెట్ పెట్టినా ఆశ్చర్యం లేదని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్న నేపథ్యం లో వచ్చే ఏడాది సమ్మర్ లో లేదా దసరా కి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా లో కూడా ఒక భారీ ఐటెం సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభం అయ్యాయి. సినిమా పై అన్ని భాషల్లో కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.