Begin typing your search above and press return to search.
పుష్ప 2 స్క్రిప్ట్ వర్క్ అప్డేట్.. షూటింగ్ ఎప్పుడంటే!
By: Tupaki Desk | 14 Jun 2022 9:34 AM GMTఅల్లు అర్జున్.. సుకుమార్ ల కాంబోలో రూపొందిన పుష్ప పార్ట్ 1 భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందుకున్న నేపథ్యం లో పార్ట్ 2పై అంచనాలు భారీగా ఉన్నాయి. సుకుమార్ పార్ట్ 1 విడుదల అయిన రెండు నెలల్లోనే పార్ట్ 2 షూటింగ్ కు వెళ్లాలని ముందస్తుగానే స్క్రిప్ట్ ను రెడీ చేసుకున్నాడు. పుష్ప పాన్ ఇండియా స్థాయిలో హిట్ అయిన నేపథ్యంలో పుష్ప పార్ట్ 2 కూడా అదే స్థాయిలో ఉండాలనే ఉద్దేశ్యంతో సుకుమార్ స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేశాడు.
గత ఆరు నెలలుగా స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లుగా సుకుమార్ టీమ్ నుండి వార్తలు వస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప 2 స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యింది. ఎట్టకేలకు షూటింగ్ కు వెళ్లబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు సిద్దం అయ్యారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలు అయ్యిందట.
హీరో అల్లు అర్జున్ లుక్ విషయంలో మరియు హీరోయిన్ మరియు ఇతర పాత్రల యొక్క లుక్ విషయంలో చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి అవ్వబోతుంది. కనుక ఖచ్చితంగా సినిమాను వచ్చే నెలలో మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. స్క్రిప్ట్ వర్క్ కోసం ఎక్కువ సమయం తీసుకున్న సుకుమార్ షూటింగ్ ను చాలా స్పీడ్ గా ముగించబోతున్నాడని అంటున్నారు.
జులై లేదా కాస్త అటు ఇటుగానే షూటింగ్ ను పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. స్క్రిప్ట్ విషయంలో బన్నీ తో పాటు నిర్మాతలు మరియు ఇతర డైరెక్షన్ టీమ్ చాలా నమ్మకంగా ఉన్నారట. కాస్త ఆలస్యం అయినా మంచి స్క్రిప్ట్ రెడీ అయ్యిందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప పార్ట్ 2 షూటింగ్ ను అతి త్వరలోనే ప్రారంభించబోతున్నారు. మొదట ఈ ఏడాది డిసెంబర్ లోనే సినిమాను విడుదల చేస్తారని అంతా భావించారు.
అనుకున్న సమయంకు స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాకపోవడంతో షూటింగ్ ఆలస్యం అయ్యింది. దాంతో సినిమా విడుదల విషయంలో కూడా కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది ఆరంభంలో సంక్రాంతి సీజన్ కు లేదంటే సమ్మర్ ఆరంభంలోనే విడుదల చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.