Begin typing your search above and press return to search.

పుష్ప2 షూటింగ్.. అల్లు అర్జున్ రెడీ!

By:  Tupaki Desk   |   19 Jan 2023 4:55 AM GMT
పుష్ప2 షూటింగ్.. అల్లు అర్జున్ రెడీ!
X
పుష్ప సినిమా రిలీజ్ అయి ఏడాది గడుస్తున్నా ఆ సినిమాను ప్రేక్షకులు మర్చిపోలేక పోతున్నారు. ఇప్పటికీ తగ్గేదే లే అంటూ డైలాగులు వేస్తున్నారు. అయితే పుష్ప రిలీజైన ఏడాది తర్వాత మళ్లీ పుష్ప సెకండ్ పార్ట్ సెట్స్ లోకి ఆయన అడుగు పెట్టారు. ఎర్రచందనం, స్మగ్లింగ్ సామ్రాజ్యానికి రారాజుగా కనిపించేందుకు.. అల్లు అర్జున్ గత నెలలోనే రెడీ అయిపోయాడు. డిసెంబర్ లోనే పుష్ప - 2 సినిమా షూటింగ్ ప్రారంభం అయిన విషయం అందరికీ తెలిసిందే.

అయితే గతేడాది డిసెంబర్ నెలలో 5 రోజుల్లో షూటింగ్ లో పాల్గొన్న స్టైలిష్ స్టార్ మరోసారి షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు వైజాగ్ చేరుకోబోతున్నట్లు తెలుస్తోంది. వైజాగ్ లోనే సినిమా షూటింగ్ నడుస్తోంది. అయితే ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, సునీల్ తదితరులు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే ఇందులో కూడా రష్మికనే హీరోయిన్.

పుష్ప సినిమాలో తగ్గేదే లే డైలాగ్ తెగ పేలింది. అయితే ఈ సెకండ్ పార్ట్ లో అస్సలే తగ్గేదే లే అనే డైలాగ్ ఇటీవలే నెట్టింట వైరల్ గా మారిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే "అడవిలో జంతువులు నాలుగు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్థం.. అదే పులి నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప రాజ్ వచ్చాడని అర్థం" అనే డైలాగ్ కూడా నెట్టింట తెగ వైరల్ అయింది. ఈ రెండు డైలాగ్ లు పుష్ప-2 సినిమాలో ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఇదే నిజమైతే మొదటి పార్ట్ కు వచ్చిన క్రేజే సెకండ్ పార్ట్ కు కూడా వస్తుందని చాలా మంది అశాభావం వ్యక్తం చేస్తున్నారు.

పుష్ప సినిమాలాగే పుష్ప టూని కూడా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది అంటే 2024 వేసవిలో రిలీజ్ కు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇండియాలో ఈ సినిమా విడుదల అయిన రోజే మిగతా దేశాల్లో కూడా రిలీజ్ చేయాలని చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది. అమెరికా, రష్యా వంటి దేశాల్లో కూడా పుష్ప భారీ స్థాయిలో కలెక్షన్లు సాధించింది. దేశ వ్యాప్తంగా 300 కోట్ల రూపాయలు వసూలు చేస్తే.. కేవలం హిందీలోనే 100 కోట్ల రూపాయలను సంపాదించింది. మరి పుష్ప-2 ఏ రేంజ్ లో కలెక్షన్లు వసూలు చేయబోతుందో తెలియాలంటే ఇంకో ఏడాది ఆగాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.