Begin typing your search above and press return to search.

పుష్ప 2 అప్డేట్ వస్తోంది.. గేట్ రెడీ!

By:  Tupaki Desk   |   4 Jan 2023 9:30 AM GMT
పుష్ప 2 అప్డేట్ వస్తోంది.. గేట్ రెడీ!
X
స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారిపోయిన అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఎనలేని గుర్తింపునందుకున్నాడు. ఇక అతను ఇప్పుడు రెండో భాగానికి సంబంధించిన షూటింగ్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తప్పకుండా ఈ సినిమా ఊహించని స్థాయిలో తెరపైకి వస్తుంది అని చిత్ర యూనిట్ సభ్యులు ఇదివరకే క్లారిటీ ఇచ్చారు. బయటకు వెళ్ళినా కూడా వారు పుష్ప గురించి ఏదో ఒక వివరణ ఇవ్వకుండా అయితే ఉండడం లేదు.

అయితే ఇంతవరకు సరైన పోస్టర్ కూడా విడుదల చేయలేదు. పుష్ప సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తి చేస్తారు అలాగే సినిమా ఎప్పుడు వస్తుంది అని వివరాలు ఏవి కూడా ఇంకా చెప్పలేదు. కానీ దర్శకుడు సుకుమార్ మాత్రం ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టినట్లుగా కొన్ని కథనాలు అయితే వెలువడుతున్నాయి.

ఇక అల్లు అర్జున్ కూడా ఈ సినిమా షూటింగ్ కోసం వీలైనంత ఎక్కువ సమయం తీసుకునే పూర్తి చేయాలని అనుకుంటున్నాడు.

ఎందుకంటే పుష్ప మొదటి భాగానికి సంబంధించిన పొరపాట్లు మళ్లీ జరగకుండా చూసుకోవాలని కూడా ఆలోచిస్తున్నారు. ఇక పుష్ప సినిమాకు సంబంధించిన అప్డేట్ విషయంలో ఇటీవల ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అసలైతే ఇండియాలో అవతార్ 2 సినిమా విడుదలతో పాటు పుష్ప 2 సినిమాకు సంబంధించిన ఒక ఫస్ట్ గ్లిమ్స్ కూడా విడుదల చేయాలని అనుకున్నారు.

కానీ అప్పుడు కుదరలేదు ఇక న్యూయార్ కైనా అప్డేట్ ఇస్తారేమో అనుకుంటే అప్పుడు కూడా వీలుపడలేదు. ఇక ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ లో మాత్రం తప్పకుండా పుష్ప 2 సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వాలని సుకుమార్ డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది.

అన్ని భాషల వారికి కనెక్ట్ అయ్యే విధంగా అదిరిపోయేలా ఒక ఫస్ట్ గ్లింప్స్ రెడీ చేసినట్లుగా టాక్ అయితే వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అధికారికంగా మరో క్లారిటీ వచ్చేవరకు ఆగాల్సిందే. మొదటి పార్ట్ కంటే ఈ సినిమా కోసం ఎక్కువ స్థాయిలో మైత్రి మూవీ మేకర్స్ బడ్జెట్ కేటాయించింది. ఇక సినిమాను 2024లో విడుదల చేయనున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.