Begin typing your search above and press return to search.

బాలీవుడ్ కు నైట్ మేర్ లా మారిన పుష్ప‌

By:  Tupaki Desk   |   31 March 2022 2:30 PM GMT
బాలీవుడ్ కు నైట్ మేర్ లా మారిన పుష్ప‌
X
`బాహుబ‌లి` నుంచి ఉత్త‌రాదిపై మ‌రీ ప్ర‌ధానంగా బాలీవుడ్ పై మ‌న సినిమాలు దాడి చేస్తూనే వున్నాయి. ఇప్ప‌టికే ఆత్మ‌ప‌రిశీల‌న‌లోకి వెళ్లిపోయిన బాలీవుడ్ స్టార్స్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన `పుష్ప ది రైజ్‌` నైట్ మేర్ లా వెంటాడుతోంది. ఇటీవ‌ల ఏ ప్రెస్ మీట్ జ‌రిగినా ట్రిపుల్ ఆర్ రిలీజ్ వ‌ర‌కు బాలీవుడ్ మీడియా అక్క‌డి స్టార్స్ ని వ‌రుస ప్ర‌శ్న‌ల‌తో టార్చ‌ర్ చేసింది. `పుష్ప‌` సాధించిన వంద కోట్ల‌ని ఎక్జాంపుల్ గా చూపిస్తూ మ‌న సినిమాలు ఎందుకు ఈ స్థాయిలో ఆడియ‌న్స్ ని ఆక‌ట్టుకోలేక‌పోతున్నాయంటూ నిల‌దీసింది.

ఓ ద‌శ‌లో `పుష్ప‌` కార‌ణంగా బాలీవుడ్ స్టార్స్ మీడియా స‌మావేశాల్లో చాలా ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల్ని ఎదుర్కొన్నారు. అక్ష‌య్ కుమార్ లాంటి స్టార్ కూడా త‌న అస‌హ‌నాన్ని క‌నిపించ‌కుండా క‌వ‌ర్ చేయ‌లేక `బ‌చ్చ‌న్ పాండే` ప్రెస్ మీట్ లో దొరికిపోయాడు. ఇలా బాలీవుడ్ ను , బాలీవుడ్ స్టార్ ల‌ని గ‌త ఐదు నెల‌లుగా వెంటాడుతున్న `పుష్ప‌` చివ‌రికి త‌న హావాని బుల్లితెర రేటింగ్ విష‌యంలోనూ చూపించి షాకిచ్చింది.

బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ న‌టించిన `సూర్య‌వ‌న్షీ` సినిమాని బీట్ చేసి టీఆర్పీ రేటింగ్ ప‌రంగానూ అక్ష‌య్ కుమార్ కు చుక్క‌లు చూపించింది. ఇటీవ‌లే ఈ మూవీ బుల్లితెర‌పై ప్రీమియ‌ర్ అయింది. అయితే ఇదే స‌మ‌యంలో హిందీ చిత్రం `సూర్య‌వ‌న్షీ` ని కూడా ప్రీమియ‌ర్ చేశారు. ఈ రెండు చిత్రాల మ‌ధ్య అర్బ‌న్‌, రూర‌ల్ ఏరియాల్లో ర‌స‌వ‌త్త‌ర పోటీ ఏర్ప‌డింది. అర్బ‌న్ లో `పుష్ప‌` 4.35 రేటింగ్ ని సొంతం చేసుకుంటే `సూర్య‌వ‌న్షీ` 2.7 రేటింగ్ ని మాత్రమే ద‌క్కించుకుని చ‌తికిల‌ప‌డింది.

ఇక అర్బ‌న్ పే లో ఛాన‌ల్స్ విభాగంలో `పుష్ప‌` 3.79 రేటింగ్ ని సాధిస్తే `సూర్య‌వ‌న్షీ`3.18 రేటింగ్ తో స‌రిపెట్టుకుంది. హిందీ స్పీకింగ్ మార్కెట్ (హెచ్ ఎస్ ఎమ్ ) లో ని అర్బ‌న్ ప్ల‌స్ రూర‌ల్ ఏరియాల్లోనూ పుష్ప ఆధిప‌త్యాన్ని కొన‌సాగించింది. పుష్ప అక్క‌డ 4.23 రేటింగ్ ని సొంతం చేసుకుంటే `సూర్య‌వ‌న్షీ` 1.68 రేటింగ్ ని మాత్ర‌మే సొంతం చేసుకుంది. దీన్ని బ‌ట్టి ద‌క్షిణాది పాన్ ఇండియా మూవీస్ బాలీవుడ్ చిత్రాల‌కు బుల్లితెర‌పై కూడా ఏ స్థాయి పోటీని ఇస్తున్నాయో అర్థం చేసుకోవ‌చ్చు.