Begin typing your search above and press return to search.

అమెరికాలో పుష్ప బ్రేక్ ఈవెన్ ఛాన్స్‌?

By:  Tupaki Desk   |   24 Dec 2021 5:32 AM GMT
అమెరికాలో పుష్ప బ్రేక్ ఈవెన్ ఛాన్స్‌?
X
అమెరికాలో తెలుగు సినిమాల హ‌వా కొన‌సాగుతోంది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా వినోదం ఆస్వాధించేవారిలో ఆందోళ‌న లేదన‌డానికి ఇది నిద‌ర్శ‌నం. ఇటీవ‌ల విడుద‌లైన ల‌వ్ స్టోరి- అఖండ మిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్ లో చేరి వ‌సూళ్ల పోరులో దూసుకుపోవ‌డంతో ఇప్పుడు అది పుష్ప‌కు కూడా పెద్ద ప్ల‌స్ అయ్యింది. ఈ సినిమా క్రైసిస్ లోనూ 2మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేస్తుండ‌డం గొప్ప ఆశావ‌హ ధృక్ప‌థాన్ని పెంచుతోంది.

పుష్ప- ది రైజ్ కి సంబంధించి అమెరికాలో ప‌లు ప్రీమియర్ షోలు రద్దు అయినా కానీ.. ప్రీమియర్‌లు 1వ రోజు నుండి మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేయడం విశేషం. పుష్ప అమెరికా బాక్సాఫీస్ వద్ద మంచి ప్రారంభాన్ని పొందింది. కంటెంట్ డెలివరీలో ఆలస్యం ప్రీమియ‌ర్ల‌కు ఇబ్బంది అయినా కానీ.. త‌ర్వాత నెమ్మ‌దిగా కోలుకుంది. ఇప్ప‌టికి మొత్తం 1.9 మిలియన్ డాల‌ర్ల‌కు చేరుకుంది.

అయితే పుష్ప బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 2.7 మిలియన్ డాల‌ర్లు అయినా వ‌సూలు చేయాల్సి ఉంది. కానీ ఇటీవ‌లి వ‌సూళ్లు నెమ్మ‌దించాయి. దీంతో అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుందా? అంటే చెప్ప‌లేని ప‌రిస్థితి ఉంది. కానీ 2 మిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్ లో చేరేందుకు ఆస్కారం ఉందని ట్రేడ్ విశ్లేషిస్తోంది. బ్రేక్ ఈవెన్ స్థితిని పొందేందుకు మరో 800K డాల‌ర్లు వసూలు చేయాలి. ఇప్పుడు క్రిస్మస్ సెలవులు పుష్ప‌కు క‌లిసొస్తాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. మునుముందు ఏం జ‌రుగుతుందో వేచి చూడాలి. ఇక పుష్ప రిలీజ్ స‌మ‌యంలోనే చాలా చోట్ల స్పైడ‌ర్ మ్యాన్ సిరీస్ మూవీ నుంచి కాంపిటీష‌న్ ఎదురైన సంగ‌తి తెలిసిందే. దానివ‌ల్ల పుష్ప‌కు కొంత మైన‌స్ అయ్యింద‌ని భావిస్తున్నారు.