Begin typing your search above and press return to search.

అక్క మొగుడే అన్నట్లు పుష్ప నే దిక్కు

By:  Tupaki Desk   |   4 Jan 2022 11:38 AM GMT
అక్క మొగుడే అన్నట్లు పుష్ప నే దిక్కు
X
ఏ దిక్కూ లేకపోతే అక్క మొగుడే దిక్కు అన్నట్లుగా నార్త్‌ లో సినిమా ప్రేమికులకు పుష్ప అక్క మొడుగు అయ్యాడు అనిపిస్తుంది. నార్త్‌ లో చాలా రాష్ట్రాల్లో కోవిడ్‌ ఆంక్షలు అమలు అవుతున్నాయి. దాంతో థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి.. మరి కొన్ని చోట్ల నైట్‌ కర్ఫ్యూలు అమలు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నార్త్‌ లో పెద్ద సినిమాలే కాదు చిన్న సినిమాలు కూడా విడుదలకు నోచుకోవడం లేదు. దాంతో అక్కడ ఇప్పటికే విడుదల అయిన సినిమాలనే ప్రేక్షకులు చూడాల్సిన పరిస్థితి. నార్త్‌ లో ప్రస్తుతం 83 మరియు పుష్ప సినిమాలు మాత్రమే నడుస్తున్నాయి. మాస్ ఆడియన్స్ 83 సినిమా కంటే కూడా అధికంగా పుష్ప సినిమాను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా వస్తున్న వసూళ్లను బట్టి అర్థం అవుతోంది.

హిందీలో పుష్ప సినిమా విడుదల చేయాలా అనే మిమాంశ మొదట మేకర్స్‌ ఉన్నారు.. ఆ తర్వాత సినిమాను సౌత్‌ తో పాటు నార్త్‌ లో కూడా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే అక్కడ విడుదలకు కొన్ని చిక్కులు వచ్చి పడ్డాయి. దాంతో హిందీ వర్షన్‌ థియేటర్‌ రిలీజ్‌ లేదు ఎప్పటిలాగే యూట్యూబ్‌ లో వదిలేస్తారనే ప్రచారం జరిగింది. కాని కొందరి మద్యవర్థిత్తంతో సినిమాను మళ్లీ హిందీ వర్షన్‌ తో థియేటర్‌ రిలీజ్ చేశారు. విడుదల అయిన మొదటి రోజు సినిమా కు కనీసం 15 నుండి 20 శాతం ఆక్యుపెన్సీ రాలేదు.. ప్రింట్స్ ధర మరియు డబ్బింగ్ ఖర్చులు కూడా రాకపోవచ్చు అన్నారు. కట్‌ చేస్తే సినిమా 50 కోట్లకు చేరువ అయ్యింది. 50 కోట్ల రాబట్టడం గొప్ప అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా 65 కోట్ల రూపాయల వసూళ్లను పుష్ప రాబట్టింది.

సినిమా మొదటి వారంలో రాబట్టిన వసూళ్లతో పోల్చితే రెండవ వారంలో మూడవ వారంలో రాబట్టిన వసూళ్లు ఎక్కువగా ఉన్నాయి. కొత్త సంవత్సరం వీకెండ్‌ కు పుష్ప సినిమా ఇక్కడ అక్కడ అన్ని చోట్ల కూడా భారీగా వసూళ్లు రాబట్టింది. ఆ దెబ్బతో సినిమా 300 కోట్ల క్లబ్‌ లో చేరిపోవడం మాత్రమే కాకుండా 2021 ఇండియాస్ బిగ్గెస్ట్‌ నెం.1 సినిమా నిలిచింది. బాలీవుడ్‌ లో ఏ సినిమాలు లేక పోవడంతో ప్రేక్షకులు ఏదో ఒక సినిమా అన్నట్లుగా ఈ సినిమాను చూస్తున్నట్లుగా ఓపెన్‌ గానే చెప్పేసుకోవచ్చు.

ఇతర రాష్ట్రాల్లో కూడా సినిమా కు మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి. కేరళలో 2021 లో విడుదల అయిన డబ్బింగ్ చిత్రాల్లో టాప్‌ చిత్రంగా పుష్ప సినిమా నిలిచింది అంటూ ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా అనుకున్న వసూళ్ల కంటే 50 శాతం అదనంగా రాబట్టినట్లుగా టాక్‌ వినిపిస్తుంది. పుష్ప జోరు చూస్తుంటే సంక్రాంతి వరకు కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. థియేటర్‌ లో ఇంకా మంచి వసూళ్లు నమోదు అవుతున్న కారణంగా ఓటీటీ స్ట్రీమింగ్‌ వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.