Begin typing your search above and press return to search.
వైరల్ వీడియో : WWEలో పుష్ప నీఅవ్వ తగ్గేదేలే
By: Tupaki Desk | 1 July 2022 6:30 AM GMTఅల్లు అర్జున్ తో సుకుమార్ ఏ ముహూర్తానా నీఅవ్వ తగ్గేదేలే అనే డైలాగ్ ను చెప్పించాడో కాని ప్రపంచం మొత్తం కూడా ఆ డైలాగ్ ఆ మ్యానరిజం తో సహా వైరల్ అవుతోంది. భాష ఏదైనా కూడా భావం మాత్రం అందరికి ఈజీగా అర్థం అయ్యేలా బన్నీ తో సుకుమార్ చేయించిన తీరుకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యి.. గడ్డం కింద నుండి చేయి పోనిస్తూ తగ్గేదే లే అంటున్నారు.
ఇప్పటి వరకు ఈ తగ్గేదే లే డైలాగ్ ను వేరు వేరు భాషల్లో వేరు వేరు దేశాల్లో.. ప్రపంచ స్థాయి వేదిక ల మీద చూస్తూ వచ్చాం. ఇప్పుడు మరో సారి ఈ తగ్గేదేలే మ్యానరిజం ను WWE వేదికగా అంతర్జాతీయ స్థాయిలో మరింతగా పాపులర్ అయ్యేలా రెజ్లర్ చేసిన ఈ యాక్ట్ ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. క్రికెట్ తో పాటు గతంలో కొన్ని ఆటల వేదికలపై తగ్గేది లే అన్నారు. కాని మొదటి సారి WWE లో తగ్గేదలే చూశాం.
ఇటీవల ప్రపంచ ప్రముఖ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైనింగ్ షో WWE లో ఇండియన్ రెజ్లర్ అయిన సౌరవ్ గుర్జార్ పుష్ప డైలాగ్ జుకేంగా నై అంటూ ప్రత్యర్థిని చిత్తు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. పుష్ప క్రేజ్ ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్లిందో ఈ వీడియోను చూస్తుంటే అర్ధం అవుతుంది.
సౌరవ్ గుర్జాన్ ఈ వీడియోను స్వయంగా ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. అల్లు అర్జున్ అభిమానులతో పాటు ఎంతో మంది ఈ వీడియో కు స్పందిస్తూ షేర్ చేస్తూ ఉన్నారు. బన్నీ మరియు పుష్ప టీమ్ కూడా ఈ వీడియో కు స్పందిస్తున్న తీరు అందరికి ఆశ్చర్యంగా ఉంది.
అల్లు అర్జున్ పుష్ప 1 సినిమా భారీ బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో పుష్ప 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సుకుమార్ ప్రస్తుతం పుష్ప 2 స్క్రిప్ట్ విషయంతో బిజీగా ఉన్నాడు.
కేజీఎఫ్ 2 ను మించేలా పుష్ప 2 ఉంటుందనే నమ్మకం తో బన్నీ ఫ్యాన్స్ ఉన్నారు. మరియు సుకుమార్ ఏం చేస్తాడో చూడాలి.