Begin typing your search above and press return to search.
పుష్ప ఐటెం సాంగ్ ఖరీదు రూ.5 కోట్లు!!
By: Tupaki Desk | 14 Dec 2021 3:30 PM GMTఅల్లు అర్జున్.. సుకుమార్ ల కాంబోలో రూపొందిన పుష్ప సినిమా విడుదల తేదీ దగ్గర పడింది. ఈనెల 17న విడుదల కాబోతున్న ఈ సినిమాలోని ఐటెం సాంగ్ గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. సమంత ఈ సినిమాలో ఊ అంటావా.. ఉఊ అంటావా మావా అంటూ రచ్చ చేసింది. పాట విడుదల అయినప్పటి నుండి సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. అదుగో ఇదుగో అన్నట్లుగా పాట పై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మొదట ఈ సినిమా పాటను కొందరు విమర్శించారు. ఇలాంటి పాట ఏంటీ అంటూ విమర్శించిన వారే ఇప్పుడు పదే పదే పాట వింటూ విజువల్స్ ను ఎంజాయ్ చేస్తున్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి.
సినిమా భారీ బడ్జెట్ తో రూపొందిన విషయం తెల్సిందే. సినిమాకు తగ్గట్లుగానే ఈ ఐటెం సాంగ్ కూడా ఉంటుందని.. భారీ విజువల్ వండర్ అన్నట్లుగా పాటను చిత్రీకరించారు. మీడియా వర్గాల వారి ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఒక్క పాట కోసం మేకర్స్ దాదాపుగా 5 కోట్లు ఖర్చు చేశారని తెలుస్తోంది. సమంతకు కోటికి పైగా పారితోషికంను కట్టబెట్టారట.
ఇంకా క్లీయర్ గా చెప్పాలంటే 1.2 కోట్ల రూపాయలను సమంతకు ఇచ్చారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ విషయంలో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. కేవలం వారం రోజుల్లోనే ఈ పాటను పూర్తి చేశారు. అయినా అంత ఇచ్చి ఉంటారా అంటే ఖచ్చితంగా ఇచ్చి ఉంటారు.. ఎందుకంటే సమంత వంటి స్టార్ హీరోయిన్ ఐటెం సాంగ్ చేయడం వల్లే ప్రస్తుతం పుష్పకు ఇంత బజ్ క్రియేట్ అయ్యింది అనడంలో సందేహం లేదు.
సమంత పారితోషికం మాత్రమే కాకుండా పాట కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్టింగ్ కూడా చాలా భారీగా కనిపిస్తుందని అంటున్నారు. ఇక పాట కోసం డాన్సర్స్.. జూనియర్ ఆర్టిస్టులు ఇతర స్టాప్ సాంకేతిక నిపుణులు ఇతర స్టాఫ్ ఇంకా బన్నీ డేట్ల ఖరీదు అంతా కలిస్తే పాట ఖరీదు 5 కోట్ల రూపాయలు అయ్యి ఉంటుందని విశ్లేషకుల అంచనా. ఒక్క ఐటెం సాంగ్ కు ఇంత ఖర్చు పెట్టడం సబబేనా అంటే ఖచ్చితంగా బన్నీ నటించిన పుష్ప వంటి మాస్ సినిమాకు సబబే అన్నట్లుగా విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.
చేసిన ఖర్చును మించి ప్రేక్షకులు మాస్ సాంగ్ తో ఖచ్చితంగా ఎంటర్ టైన్ అవుతారు అంటూ యూనిట్ సభ్యులు కూడా ఆఫ్ ది రికార్డు చెబుతున్నారు. సినిమా లో ఐటెం సాంగ్ కోసం సమంత తాము అడిగినట్లుగా చేసిందని.. ఆమె ఐటెం సాంగ్ ను చేసేందుకు ఎలాంటి పరిమితులు కండీషన్స్ ను పెట్టలేదని బన్నీ పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు. కనుక ఆ మాత్రం పారితోషికం ఆమెకు ఇవ్వడం సబబే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.