Begin typing your search above and press return to search.
ఊ అంటావా.. పాట వెనక ఇన్నేళ్ల నిరీక్షణ వుందా?
By: Tupaki Desk | 29 Dec 2021 2:30 AM GMTబన్నీ నటించిన పాన్ ఇండియా మూవీ `పుష్ప`. సుకుమార్ తెరకెక్కించారు. కన్నడ సోయగం రష్మిక మందన్న డీ గ్లామర్ పాత్రలో శ్రీవల్లిగా నటంచిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ,ముత్యంశెట్టి మీడియా బ్యానర్‌పై అత్యంత భారీ స్థాయిలో నిర్మించారు. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా లెవెల్లో దాదాపు ఐదు భాషల్లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. బాలీవుడ్ సినిమాలని మించి హిందీ వెర్షన్ వసూళ్లని రాబడుతున్న నేపథ్యంలో ఈ సినిమాపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.
బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ `పుష్ప` సినిమా వసూళ్లపై హాట్‌కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. ఈ సినిమా సాధించిన ఓపెనింగ్స్ ని బాలీవుడ్ సినిమా రాబట్టలేకపోయిందని ఆయన వాపోవడం గమనార్హం. ఇదిలా వుంటే ఈ సినిమా సాధిస్తున్న విజయం నేపథ్యంలో చిత్ర బృదం హైదరాబాద్ లో థ్యాంక్స్ మీట్ ని నిర్వహిచింది. ఈ సందర్భంగా సమంత నటించిన `ఊ అంటావా.. పాట వెనకున్న ఆసక్తికరమైన స్టోరీని దర్శకుడు సుకుమార్ వెల్లడించారు. అంతే కాకుండా ఈ పాట రాసిన చంద్రబోస్ ని సిరివెన్నెల తరువాత అంతటి వాడంటూ పోల్చడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ సందర్భంగా మాట్లాడిన సుకుమార్ `కథ రాసేప్పుడు కానీ సినిమా తీసేప్పుడు కానీ అందరూ అంటుంటారు. సినిమా తీస్తున్నప్పుడు ఈ రోజు హ్యాపీగా వుండాలని అంతా అంటుంటారు కానీ నా జర్నీ ఏంటో హ్యాపీగా వుండదు. చాలా బాధపడుతూ నాజర్నీ సాగుతుంది. అందుకే రిజల్ట్ రోజుని చాలా ఇంపార్టెంట్. బోస్ గారు `ఊ అంటావా ఉఉఊ అంటావా పాటని నాలుగేళ్ల క్రితం చెప్పారు. అప్పుడే దీన్ని ఉంచేయండి ఎవరికీ ఇవ్వకండని చెప్పా. నాలుగేళ్లు నాకోసం దాచిన పాట ఇప్పుడు యావత్ ప్రపంచానని ఊ అంటావా.. ఉఊ అంటావా అని ఊపేస్తోంది.
గతంలో నేను పొయెట్రీ రాసేవాడిని కానీ చంద్రబోస్ స్పాంటెనియటీకి, అక్షర జ్ఞానానికి.. ఈయన జ్ఞాపక శక్తికి ఈ సందర్భంగా సీతారామశాస్త్రి గారిని తలుచుకోవాలి. నేను ఇండస్ట్రీలో ఇద్దరు వ్యక్తులని చూడాలనుకున్నాను. ఒక వ్యక్తి సీతారామశాస్త్రిగారు. మరో వ్యక్తి గురించి ఇప్పుడు చెప్పలేను. ఆయన తరువాత అంత గొప్ప వ్యక్తి ఎవరని వెతుక్కోవాలనుకున్నాను. అలా వెతుకుతున్న సమయంలో నాకు చంద్రబోస్ గారు దొరికారు.ఆయన జ్ఞాపక శక్తి అమోఘం.
ఐదు నిమిషాల్లోనే టకా టకా ఆప్షన్ లు ఇచ్చేస్తుంటారు. ఈ సందర్భంగా స్టేజ్ పై చంద్రబోస్ కాళ్లకు నమస్కరించే ప్రయత్నం చేసి అక్కడున్న వారిని సుకుమార్ ఆశ్చర్యానికి గురిచేశారు. ఆయనన మామూలు వ్యక్తిగానే కనిపిస్తారు కానీ ఆయన శక్తి ఏంటో ఆయన ప్రతిభ ఏంటో నాకుమాత్రమే తెలుసు. నేను దగ్గరుండి ఆయనని పరిశీలించాను కాబట్టే ఆయన గురించి చెబుతున్నాను` అని సుకుమార్ అందరినీ సర్‌ప్రైజ్ చేశారు.