Begin typing your search above and press return to search.
'పుష్ప' మేకర్స్ కంఫర్మ్ చేశారా..? ఇప్పటికైనా క్లారిటీ ఇస్తారా..?
By: Tupaki Desk | 12 May 2021 6:00 AM GMTఅల్లు అర్జున్ - దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ''పుష్ప''. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రూపొందుతోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ గా బన్నీ కనిపించనున్నాడు. ఆయనకు జోడీగా రష్మిక మందన్నా నటిస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా ఈ చిత్రాన్ని 'బాహుబలి' 'కేజీఎఫ్' మాదిరిగా రెండు భాగాలుగా చేస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. దసరాకి ఫస్ట్ పార్ట్, వచ్చే ఏడాది సెకెండ్ పార్ట్ విడుదల అవుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్.. ఓ మ్యాగజైన్ తో మాట్లాడుతూ 'పుష్ప' చిత్రాన్ని 2 పార్ట్స్ గా చేస్తున్నామనే విషయాన్ని కంఫర్మ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
''పుష్ప ఎంతో స్పాన్ ఉన్న సబ్జెక్ట్. అటువంటి కథను రెండున్నర గంటల్లో చెప్పడం చాలా కష్టం. అందుకే బన్నీ - సుకుమార్ అందరం కలసి రెండు పార్ట్స్ గా ఈ చిత్రాన్ని తీయాలని నిర్ణయించుకొన్నాం. ఫస్ట్ పార్ట్ పూర్తి కాగానే రెండో పార్ట్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం. ఇప్పటికే సెకండ్ పార్ట్ కి సంబంధించి 10 శాతం షూటింగ్ పూర్తయింది'' అని నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ వెల్లడించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇదే నిజమనుకోవడానికి ఇంతవరకు దీనిపై చిత్ర బృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే 'పుష్ప' రెండు భాగాలపై ప్రెస్ నోట్ ఇచ్చి మరింత క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఇకపోతే 'పుష్ప' తరువాతే అల్లు అర్జున్ తన తదుపరి సినిమా గురించి ఆలోచిస్తాడని తెలుస్తోంది.
ప్రస్తుతానికైతే బన్నీ ముగ్గురు దర్శకుల్ని లైన్ లో పెట్టాడు. వారే ప్రశాంత్ నీల్ - కొరటాల శివ - మురుగదాస్. 'కేజీఎఫ్ 2' చిత్రాన్ని రిలీజ్ కి రెడీ చేసిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో 'సలార్' సినిమా చేస్తున్నాడు. 'ఆచార్య' సినిమా చేస్తున్న కొరటాల శివ.. ఎన్టీఆర్ తో తదుపరి సినిమా చేయనున్నాడు. ఇక మురగదాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఈ ముగ్గురిలో అల్లు అర్జున్ ఫస్ట్ ఛాయిస్ మాత్రం ప్రశాంత్ నీల్ అని తెలుస్తోంది. 'పుష్ప' ఫైనల్ స్టేజీకి వచ్చిన తర్వాత బన్నీ నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తాడనే విషయం తెలుస్తుంది. ఇకపోతే ఇటీవల కరోనా బారిన పడిన బన్నీ చికిత్స తీసుకొని కోలుకున్నాడు. 15 రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉన్న తర్వాత నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.