Begin typing your search above and press return to search.
పుష్ప' బ్రేక్ రచ్చ నిజం ఎంత?
By: Tupaki Desk | 27 Jun 2021 10:30 AM GMTఅల్లు అర్జున్.. సుకుమార్ ల కాంబోలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప పై అంచనాలు భారీగా ఉన్నాయి. కేజీఎఫ్ తరహాలో రెండు పార్ట్ లుగా పుష్ప ను విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఆ విషయమై క్లారిటీ వచ్చేసింది. పుష్ప పార్ట్ 1 ఈ ఏడాది ఖచ్చితంగా ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయం. అయితే రెండవ పార్ట్ విషయమై చర్చ జరుగుతోంది. కేజీఎఫ్ 1 వచ్చిన తర్వాత గ్యాప్ లేకుండా హీరో యశ్ మరియు దర్శకుడు ప్రశాంత్ నీల్ లు కేజీఎఫ్ 2 ను చేశారు. కాని పుష్ప రెండు పార్ట్ ల మద్య మాత్రం ఇద్దరు కూడా వేరే సినిమా లు చేసే యోచనలో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి.
అల్లు అర్జున్ ఆప్తుడిగా పేరున్న బన్నీ వాసు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పుష్ప 1 తర్వాత ఐకాన్ ఉంటుందని చెప్పుకొచ్చాడు. అంటే సుకుమార్ కూడా ఆ గ్యాప్ లో విజయ్ దేవరకొండ తో సినిమా ను చేసే అవకాశాలు ఉన్నాయని అంతా భావించారు. కాని తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం పుష్ప రెండు పార్ట్ ల మద్య బ్రేక్ విషయంలో ఇద్దరి మద్య చర్చ జరుగుతోందని.. బన్నీకి రెండు పార్ట్ ల మద్య కనీసం ఏడాది గ్యాప్ ఉండాలని కోరుకుంటున్నారని.. కాని సుకుమార్ మాత్రం వెంటనే పుష్ప 2 ను కూడా మొదలు పెట్టి వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లోనే విడుదల చేయాలని భావిస్తున్నాడని అంటున్నారు.
ఈ విషయమై ఇద్దరి మద్య రచ్చ జరుగుతుంది అనేది ఇండస్ట్రీ వర్గాల పుకారు. కాని అసలు విషయం ఏంటీ అంటే పుష్ప రెండు పార్ట్ ల విషయమై బన్నీ మరియు సుకుమార్ లు పూర్తి క్లారిటీతో ఉన్నారు. సినిమా ను రెండు పార్ట్ లుగా చేయాలనుకున్న సమయంలోనే గ్యాప్ గురించి నిర్ణయం తీసుకుని ఉంటారు. కనుక ఇద్దరి మద్య విభేదాలు అనేవి ఖచ్చితంగా ఉండవు. సుకుమార్ పై ఉన్న గౌరవంతో ఒక వేల వెంటనే పుష్ప 2 చేద్దాం అన్నా కూడా బన్నీ చేసేందుకు ఓకే చెప్తాడు. దర్శకుల నిర్ణయాలను గౌరవించే హీరో బన్నీ అని.. అందుకే అసలు ఈ విభేదాలు అనేవే లేవని మెగా సర్కిల్స్ నుండి సమాచారం అందుతోంది. పుష్ప కు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఇలాంటి పుకార్లు పుట్టుకు వస్తున్నాయని మెగా వర్గాల టాక్.