Begin typing your search above and press return to search.

పుష్ప' కొత్త షెడ్యూల్ అప్ డేట్‌

By:  Tupaki Desk   |   18 March 2021 12:00 PM IST
పుష్ప కొత్త షెడ్యూల్ అప్ డేట్‌
X
అల్లు అర్జున్‌.. సుకుమార్‌ ల కాంబోలో రూపొందుతున్న పుష్ప సినిమా పై అంచనాలు ఆకాశమే హద్దుగా ఉన్నాయి. ఇద్దరు ఇండస్ట్రీ హిట్ లను దక్కించుకున్న కారణంగా సహజంగానే అభిమానుల్లో మరియు ఇండస్ట్రీ వర్గాల్లో పుష్ప పై ఆకాశమే హద్దుగా అంచనాలు ఉంటాయి. కనుక దర్శకుడు సుకుమార్‌ ఈ సినిమా ను మరింత శ్రద్దగా తీర్చి దిద్దుతున్నట్లుగా చెబుతున్నారు. పుష్ప సినిమా షూటింగ్ ఇప్పటి వరకు మేరేడుమిల్లి మరియు తమిళనాడు అటవి ప్రాంతాల్లో జరిగింది. ఇక తదుపరి షెడ్యూల్‌ ఇటీవలే హైదరాబాద్‌ లో మొదలయ్యిందట.

హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన ఒక సెట్టింగ్‌ లో చిత్రీకరణ జరుపుతున్నారు. అల్లు అర్జున్‌ ఇంకా రష్మిక మందన్నాతో పాటు కీలక పాత్రల్లో నటిస్తున్న నటీనటులు కూడా ఈ షెడ్యూల్‌ లో పాల్గొంటున్నట్లుగా చెబుతున్నారు. ఈ నెలాఖరు వరకు హైదరాబాద్‌ షెడ్యూల్‌ ను పూర్తి చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా లోని కొన్ని కీలక సన్నివేశాల కోసం కేరళ వెళ్లే యోచనలో కూడా మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది. త్వరలోనే ఆ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆగస్టులో సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే.