Begin typing your search above and press return to search.
పుష్ప OTT డీల్ డైలమా క్లియరైనట్టేనా?
By: Tupaki Desk | 5 Jan 2022 4:01 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆరంభం మిశ్రమ స్పందనలు వ్యక్తమైనా దాంతో పని లేకుండా ఈ క్రైసిస్ ని సైతం ఖాతరు చేయక జనం ఆదరించారు. దాదాపు 300కోట్ల వసూళ్లను పుష్ప సాధించిందని రిపోర్టులు అందాయి. ఇప్పటికీ హిందీ బెల్ట్ లో పుష్పకు అద్భుత వసూళ్లు దక్కుతున్నాయి. ఈ సంక్రాంతి వారంతం అన్నిచోట్లా పుష్ప కలెక్షన్స్ మరింత మెరుగ్గా ఉంటాయని అంచనా వేస్తున్నారు.
దీంతో `పుష్ప: ది రైజ్` అమెజాన్ ప్రైమ్ రిలీజ్ పై డైలమా నెలకొంది. ప్రైమ్ వీడియోలో జనవరి 7వ తేదీ నుండి స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంటుందని టాక్ వినిపించినా కానీ ఇప్పుడు మేకర్స్ కావాలనే దీనిని ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు గుసగుస వినిపిస్తోంది. అమెజాన్ ప్రైమ్ ప్రతినిధులతో ఈ విషయమై నిర్మాతలు చర్చలు సాగిస్తున్నారని సమాచారం. పుష్ప: ది రైజ్ హిందీ బెల్ట్ లో ఆశ్చర్యకరంగా బాగా రాణిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మేకర్స్ OTT ప్రీమియర్ లను ఆలస్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.
హిందీ వెర్షన్ ఇప్పటికే 50కోట్ల క్లబ్ లో చేరింది. 75కోట్లు సుమారు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ వారం పాటు వసూళ్లకు డోఖా ఉండదని భావిస్తున్నారు. దీనివల్ల హిందీ వెర్షన్ OTT విడుదలను కనీసం ఆలస్యం చేయాలని వారు ప్రయత్నిస్తున్నారు. అయితే అమెజాన్ ప్రతినిధుల నుంచి స్పందన ఎలా ఉంటుంది? అన్నది చూడాలి. పుష్ప క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని జనవరి 7న ప్రీమియర్ గా ప్రదర్శించాలని అమెజాన్ ప్రైమ్ వారు భావిస్తున్నట్టు తెలిసింది. నిజానికి ఈపాటికే అమెజాన్ నుంచి ఓటీటీ రిలీజ్ పై ప్రకటన రావాల్సి ఉండగా నిర్మాతల చర్చలతో ప్రస్తుతానికి పెండింగ్ లో ఉంది.
కనీసం హిందీ వెర్షన్ వరకూ ఆపి ఉంచాలన్న ఆలోచనకు అమెజాన్ ప్రతినిధులు ఓకే చెబుతారా లేదా? అన్నది వేచి చూడాలి.