Begin typing your search above and press return to search.

'పుష్ప' వాయిదా ఛాన్స్.. అసలు విషయం ఏంటీ?

By:  Tupaki Desk   |   20 April 2021 2:30 PM GMT
పుష్ప వాయిదా ఛాన్స్.. అసలు విషయం ఏంటీ?
X
అల్లు అర్జున్‌.. సుకుమార్‌ ల క్రేజీ మూవీ పుష్ప విడుదల తేదీ పై ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఈ ఏడాది ఆగస్టులో సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు. కాని పుష్ప సినిమా షూటింగ్‌ ఆలస్యం అవుతున్న కారణంగా ఆగస్టులో విడుదల చేయడం కష్టం అంటూ వార్తలు వస్తున్నాయి. యూనిట్‌ సభ్యుల్లో కొందరు ఇప్పటికే సినిమా వాయిదా వేయాలనే నిర్ణయానికి వచ్చారంటూ చెబుతున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాని తాజాగా మైత్రి మూవీ మేకర్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప ను అనుకున్న తేదీకి విడుదల చేసి తీరుతాం అంటూ వారు బలంగా చెబుతున్నారు.

కరోనా కారణంగా పుష్ప సినిమా షూటింగ్‌ మెల్లగా జరుగుతున్నా కూడా ఇప్పటికే మెజార్టీ పార్ట్ షూటింగ్‌ పూర్తి అయ్యింది. ప్రస్తుతం సెకండ్‌ వేవ్‌ కొనసాగుతున్నా కూడా షూటింగ్ ను కొనసాగించాలనే నిర్ణయంతో సుకుమార్‌ ఉన్నాడు. షూటింగ్‌ లో అన్ని జాగ్రత్తలు తీసుకుని చకచక పూర్తి చేయాలని యూనిట్‌ సభ్యులు భావిస్తున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ కనీసం రెండు నెలలు తీవ్ర ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కనుక సినిమా విడుదల సమయం ఆగస్టు వరకు ఖచ్చితంగా అంతా సర్థుకుంటుందని వారు నమ్మకంతో ఉన్నారు.

పుష్ప సినిమా షూటింగ్‌ ను ముగించి పరిస్థితులను బట్టి ఆగస్టులో విడుదల చేయాలా లేదా అనే విషయాన్ని అప్పటి వరకు నిర్ణయించుకుంటారట. థియేటర్లను 50 శాతం ఆక్యుపెన్సీతో నడపాలని ఆదేశాలు వచ్చాయి. థియేటర్లు తిరిగి పూర్వ వైభవంను సంతరించుకున్న సమయంలో కరోనా భయం తగ్గిన తర్వాత పుష్ప సినిమా ను విడుదల చేస్తారని అంటున్నారు. ఇంకా మూడు నెలల సమయం కు ఎక్కువగానే ఉంది కనుక అప్పటి వరకు ఏమైనా జరుగవచ్చు. కనుక ఇప్పటి నుండే పుష్ప విడుదల తేదీ గురించి అనుమానాలు అక్కర్లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. కనుక పుష్ప సినిమా విడుదల తేదీ ప్రస్తుతానికి మారలేదు. ఆగస్టులోనే సినిమా విడుదలకు అవకాశం ఉంది. పరిస్థితులు అనుకూలించకుంటే అప్పుడు కొత్త తేదీ ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి.