Begin typing your search above and press return to search.

పుష్ప ప్రీబుకింగ్స్: అమెరికాలో 2 ల‌క్ష‌ల డాల‌ర్లు

By:  Tupaki Desk   |   14 Dec 2021 6:35 AM GMT
పుష్ప ప్రీబుకింగ్స్: అమెరికాలో 2 ల‌క్ష‌ల డాల‌ర్లు
X
ప్ర‌పంచవ్యాప్తంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన `పుష్ప` సంచ‌ల‌నాల‌కు రెడీ అవుతోంది. డిసెంబ‌ర్ 17న ఈ సినిమా తెలుగు-త‌మిళం-హిందీ-క‌న్న‌డ‌-మ‌ల‌యాళం భాష‌ల్లో వ‌ర‌ల్డ్ వైడ్ గా విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఇంటా బ‌య‌టా పుష్ప రికార్డులు బ్రేక్ చేయ‌డం ఖాయ‌మ‌న్న టాక్ వినిపిస్తోంది. ఇప్ప‌టికే ట్రైల‌ర్ పాట‌లు జ‌నంలోకి దూసుకెళ్లాయి. వీటితో అమాంతం అంచ‌నాలు రెట్టింప‌య్యాయి.

ఇక ఇంటా బ‌య‌టా పుష్ప‌-ది రైజ్ భారీ ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన సంగ‌తి తెలిసిందే. అందుకు త‌గ్గ‌ట్టే భారీ వ‌సూళ్ల ల‌క్ష్యంగా ఈ చిత్రాన్ని అత్యంత భారీగా థియేట‌ర్ల‌లో రిలీజ్ చేస్తున్నారు. ఇంకా రిలీజ్ కి ముందే అమెరికాలో ఏకంగా 2ల‌క్ష‌ల డాల‌ర్లు పైగా ప్రీబుకింగ్స్ రూపంలో పుష్ప - 1 క‌లెక్ట్ చేసింది. ఇదే విష‌యాన్ని పోస్ట‌ర్ వేసి మ‌రీ వెల్ల‌డించింది చిత్ర‌బృందం. హంసిని ఎంట‌ర్ టైన్ మెంట్స్ -క్లాసిక్స్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంస్థ‌లు సంయుక్తంగా అమెరికాలో ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నాయి. అమెరికాలో స్థానిక బ‌య్య‌ర్ల‌తో వ్యాపార‌ప‌ర‌మైన డీల్స్ కుదురుతున్నాయ‌ని తెలిసింది.

అఖండ బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించ‌డంతో ఇప్పుడు పుష్ప విజ‌యంపైనా ధీమా పెరిగింది. ల‌క్కీగా ఒమిక్రాన్ ప్ర‌భావం తెలుగు రాష్ట్రాలకు అంత‌గా లేదు. అయితే ఏపీలో టిక్కెట్టు ధ‌ర‌ల‌తోనే అస‌లు స‌మ‌స్య‌. అక్క‌డ టిక్కెట్టు గిట్టుబాటు కావ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్త‌మ‌వుతోంది. అంతేకాదు బెనిఫిట్ షోల‌కు అనుమ‌తులు లేక‌పోవ‌డంతో ఆరంభ‌ వ‌సూళ్ల ప‌రంగా పంచ్ ప‌డిపోతోంది. తొలి వీకెండ్ ఆశించినంత‌గా ఏపీలో వ‌సూళ్లు రావ‌డం లేద‌న్న ఆవేద‌న డిస్ట్రిబ్యూట‌ర్ల‌లో నెల‌కొంది. ఇప్పుడు మ‌న అగ్ర హీరోల‌కు ఏపీ కంటే అమెరికా స‌హా గల్ఫ్ రిలీజ్ లే కీల‌కంగా మారుతున్నాయ‌న్న గుస‌గుస వేడెక్కిస్తోంది. పుష్ప చిత్రం తొలి మూడు రోజుల్లో 100కోట్లు.. అటుపై వారంలో 200-300 కోట్లు సునాయాసంగా వ‌సూలు చేస్తుంద‌ని అభిమాన‌ వ‌ర్గం విశ్లేషిస్తోంది. 500 కోట్ల వ‌సూళ్ల ల‌క్ష్యంగా ఈ చిత్రాన్ని సుకుమార్ - మైత్రి వ‌ర్గాలు విడుద‌ల చేస్తున్నాయన్న గుస‌గుస వినిపిస్తోంది.