Begin typing your search above and press return to search.
RRR పై 'పుష్ప' ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్
By: Tupaki Desk | 28 Dec 2021 1:36 PM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం `పుష్ప : ది రైజ్`. సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. బన్నీ నటించిన తొలి పాన్ ఇండియా మూవీగా రూపొంది ఈ చిత్రం కలెక్షన్ ల పరంగా రికార్డులు సృష్టిస్తోంది. సుకుమార్ - బన్నీల కలయికలో వచ్చిన మూడవచిత్రమిది కావడం, అంతకు ముందు వచ్చిన చిత్రాలకు పూర్తి భిన్నంగా రూపొందిన సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు ఏ మాత్రం తగ్గని స్థాయిలో బన్నీ పాత్ర వుండటంతో సినిమా విడుదలైన అన్ని ఏరియాల్లో రికార్డులు సృష్టిస్తోంది.
ఇంతకు ముందు బన్నీ - సుకుమార్ ల కలయికలో వచ్చిన చిత్రాల నేపథ్యం, బన్నీ క్యారెక్టరైజేషన్ వేరు. అయితే అంతకు పూర్తి భిన్నమైన కథ, కథనాలతో `పుష్ప`ని దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన తీరు, బన్నీ క్యారెక్టర్ ని మలిచిన విధానం ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా మార్చింది. విడుదలైన రోజు ఓపెనింగ్ కలెక్షన్ ల నుంచి రికార్డులు సృష్టిస్తున్న ఈ మూవీ రానున్న రోజుల్లో వసూళ్ల పరంగా సరికొత్త మార్కుని చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇదే విషయాన్ని మంగళవారం జరిగిన థ్యాంక్స్ మీట్ లో నిర్మాతలతో ఒకరైన నవీన్ యెర్నేని వెల్లడించి ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ `పుష్ప` సాధించిన కలెక్షన్ ల వివరాల్ని వెల్లడించారు. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ 275 కోట్ల గ్రాస్ ని సాధించిందని, అంతే కాకుండా రానున్న రోజుల్లో ఈ మూవీ 325 కోట్ల నుంచి 350 కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం వుందని సినిమాపై తమకున్న అంచనాలని మరోసారి వ్యక్తం చేశారు.
ఇదే సందర్భంగా నిర్మాత నవీన్ యెర్నేని `RRR` గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికి `పుష్ప` 275 క్రోర్స్ గ్రాస్ ని కలెక్ట్ చేసిందని వెల్లడించిన ఆయన ఇది నా అంచనాల ప్రకారం జనవరి 6 వరకు 325 కోట్ల నుంచి 350 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసే అవకాశం వుందని తెలిపారు. అంతే కాకుండా జనవరి 7న `RRR`వచ్చేస్తోంది కాబట్టి దాని ప్రభావం మా సినిమాపై పడే అవకాశం వుందని తెలిపిన నవీన్ యెర్నేని `RRR` లేకుండా పండగ వరకు మా సినిమానే వెంటే ఇంకా భారీ స్థాయిలో వసూళ్లని రాబట్టేదని స్పష్టం చేశారు.
అంతే కాకుండా ఇప్పటికే హయ్యెస్ట్ గ్రాసర్ ఆఫ్ 2021 గా `పుష్ప` రికార్డుని సాధించిందని, ఆవిషయంలో నిరమాతలుగా మేం చాలా గర్వపడుతున్నాం. అని నిర్మాత నవీన్ యెర్నేని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ సందర్భంగా `RRR` గనక కొంచెం ఆలస్యంగా వస్తే మాకు మరింత ప్లస్ అయ్యేదని, `పుష్ప` ఊహించని స్థాయిలో వసూళ్లని రాబట్టేదని ఇండైరెక్ట్ గా హింట్ ఇవ్వడంతో ఇండస్ట్రీ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది.