Begin typing your search above and press return to search.

అవ‌తార్ ని అనుస‌రిస్తోన్న పుష్ప‌-పీఎస్!

By:  Tupaki Desk   |   20 Nov 2022 4:30 PM GMT
అవ‌తార్ ని అనుస‌రిస్తోన్న పుష్ప‌-పీఎస్!
X
టాలీవుడ్ లో రీ-రిలీజ్ లు ఇప్పుడు డ్రెండ్ గా మారుతున్నాయి. ఓల్డ్ హిట్ చిత్రాల్ని డాల్మి అట్మాస్ ఫార్మెట్ లో రిలీజ్ చేసి స‌క్సెస్ అందుకుంటున్నారు. స్టార్ హీరోల బ‌ర్త్ డేల స్సెష‌ల్ గా రిలీజ్ అవుతోన్న రీ-రిలీజ్ ల‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర్థం ప‌డుతున్నారు. ప‌రిమితి థియేట‌ర్ల‌ల‌లోనే రిలీజ్ అవ్వ‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్లు బాగుంటున్నాయి.

మ‌నోళ్ల‌ని చూసి బాలీవుడ్ కూడా ఇదే త‌ర‌హాలో ఓల్డ్ క్లాసిక్ హిట్స్ ని రీరిలీజ్ చేస్తుంది. నాటి..మేటి హీరోల స‌క్సెస్ ఫుల్ చిత్రాల్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చి అభిమ‌నాల్ని అల‌రిస్తున్నారు. అలాగే హాలీవుడ్ విజువ‌ల్ వండ‌ర్ `అవ‌తార్-2` రిలీజ్ కి ముందు `అవ‌తార్` ని మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్న సంగ‌తి తెలిసిందే.

`అవ‌తార్-2` బెస్ట్ ఎక్స్ పీరియ‌న్స్ పొందాలంటే ముందు అవ‌తార్ ని ఓ సారి వీక్షిస్తే బాగుటుంది! అన్న ఉధ్దేశంతో అప్ డేటెడ్ టెక్నాల‌జీతో మ‌రోసారి అవ‌తార్ ని రిలీజ్ చేస్తున్నారు. ఇలా రీరిలీజ్ ల‌ వెనుక బిజినెస్ స్ర్టాట‌జీ క‌నిపిస్తుంది. తాజాగా అవ‌తార్ చిత్రాన్ని స్పూర్తిగా తీసుకుని పుష్ప‌-పొన్నియ‌న్ సెల్వ‌న్ మొద‌టి భాగాలు మ‌రోసారి రిలీజ్ కానున్నాయా? అందుకు త‌గ్గ ఏర్ప‌ట్లు జ‌రుగుతున్నాయా? అంటే అవున‌నే వినిపిస్తోంది.

ఇదే ఏడాది రిలీజ్ అయిన పుష్ప‌--పొన్నియ‌న్న్ మొద‌టి భాగం చిత్రాలు పాన్ ఇండియాలో పెద్ద విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఎలాంటి అంచ‌నాలు లేకండా రిలీజ్ అయిన పుష్ప బాక్సాఫీస్ ని షేక్ చేస్తే ..భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన పీఎస్ మొద‌టి భాగం వాటిని అందుకోవ‌డంలో నూరుశాతం స‌క్సెస్ అయింది. ప్రస్తుతం ఆ రెండు చిత్రాల రెండ‌వ భాగం ప‌నుల్లో మేక‌ర్స్ బిజీగా ఉన్నారు.

రెట్టించిన అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముంద‌కు తీసుకురావ‌డానికి స‌ర్వం సిద్దం చేస్తున్నారు. పాన్ ఇండియా రిలీజ్ ల‌పై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలున్నాయి. అయితే రెండు చిత్రాలు రిలీజ్ కంటే ముందు మొద‌టి భాగాల్ని మ‌రోసారి రిలీజ్ చేయాల‌న్న‌ది మేక‌ర్స్ ఆలోచ‌న‌గా క‌నిపిస్తుంది. కంటున్యూటీ స్టోరీ లు కాబ‌ట్టి రీ-రిలీజ్ చేస్తే కొన‌సాగింపు క‌థ‌లో ప్రేక్ష‌కుల‌కు ఓక్లారిటీ ఉంటుంద‌ని టీమ్ భావిస్తోందిట‌. ఈ నేప‌థ్యంలో `పుష్ప‌-2`..`పీఎస్-2` ఎప్పుడు రిలీజ్ అయినా? వాటికంటే ముందే మొద‌టి భాగాలు రీ రిలీజ్ చేయాల‌న్న‌ది ఓ ప్లాన్ గా తెలుస్తోంది.