Begin typing your search above and press return to search.

ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో 'పుష్ప‌'రాజ్ దే హవా!

By:  Tupaki Desk   |   10 Oct 2022 7:30 AM GMT
ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో పుష్ప‌రాజ్ దే హవా!
X
పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచి భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన 'పుష్ప ది రైజ్‌' ఫిల్మ్ ఫేర్ పుర‌స్కారాల్లోనూ స‌త్తా చాటింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కించిన ఈ మూవీ ఫిల్మ్ ఫేర్ పుర‌స్కారాల్లో ప‌లు విభాగాల్లో పోటీప‌డి మొత్తం ఏడు అవార్డుల్ని సొంతం చేసుకుని త‌న హ‌వాని కొన‌సాగించ‌డం విశేషం. ద‌క్షిణ భార‌త చ‌ల‌న చిత్ర రంగం విశేషంగా భావించే 67వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుక ఆదివారం బెంగ‌ళూరులో తార‌ల త‌ళుకుల మ‌ధ్య అట్ట‌హాసంగా జ‌రిగింది.

గ‌త రెండేళ్లుగా క‌రోనా కార‌ణంగా నిరాడంబ‌రంగా జ‌రిగిన ఈ వేడుక ఈ సారి మాత్రం పరిస్థితుల‌న్నీ స‌ద్దుమ‌న‌గ‌డంతో తార‌ల త‌ళుకుల మ‌ధ్య అట్ట‌హాసంగా జ‌రిగింది. టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్‌, దివంగ‌త క‌న్న‌డ హీరో పునీత్ రాజ్ కుమార్ ల‌కు జీవిత‌కాల సాఫ‌ల్య పుర‌స్కారం ల‌భించింది. ఈ సంద‌ర్భంగా పునీత్ రాజ్ కుమార్ సోద‌రుడు, స్టార్ హీరో శివ‌రాజ్ కుమార్‌, అత‌ని కుటుంబ స‌భ్యులు పునీత్ ని గుర్తు చేస్తూ పాడిన పాట అక్క‌డున్న వారంద‌రినీ కంట‌త‌డి పెట్టించింది.

ఇదిలా వుంటే ఫిల్మ్ ఫేర్ పుర‌స్కారాల్లో అల్లు అర్జున్ న‌టించిన పాన్ ఇండియా సెన్సేష‌న్ 'పుష్ప ది రైజ్‌' స‌త్తా చాటింది. మొత్తం ఏడు విభాగాల్లో పోటీప‌డిన ఈ మూవీ ఏడు అవార్డుల్ని ద‌క్కించుకోవ‌డం విశేషం. ఇదే తర‌హాలో సూర్య న‌టించిన త‌మిళ చిత్రం 'సూరారైపోట్రు' కూడా ఏడు విభాగాల్లో స‌త్తా చాటి అవార్డుల్ని ద‌క్కించుకుంది.

టాలీవుడ్ నుంచి ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్న విజేతలు వీరే

ఉత్త‌మ చిత్రం : పుష్ప ది రైజ్‌

ఉత్త‌మ న‌టుడు : అల్లు అర్జున్ (పుష్ప ది రైజ్‌)

ఉత్త‌మ ద‌ర్శ‌కుడు : సుకుమార్ (పుష్ప ది రైజ్‌)

ఉత్త‌మ న‌టి : సాయి ప‌ల్ల‌వి ( ల‌వ్ స్టోరీ)

ఉత్త‌మ న‌టుడు (క్రిటిక్స్‌) : నాని (శ్యామ్ సింగ‌రాయ్‌)

ఉత్త‌మ స‌హాయ న‌టుడు ముర‌ళీశ‌ర్మ ( అల వైకుంఠ‌పుర‌ములో)

ఉత్త‌మ న‌టి (క్రిటిక్స్‌) : సాయి ప‌ల్ల‌వి (శ్యామ్ సింగ‌రాయ్‌)

ఉత్త‌మ స‌హాయ న‌టి : ట‌బు ( అల వైకుంఠ‌పుర‌ములో)

ఉత్త‌మ నూత‌న న‌టి : కృతిశెట్టి (ఉప్పెన‌)

ఉత్త‌మ నూత‌న న‌టుడు : పంజా వైష్ణ‌వ్ తేజ్ (ఉప్పెన‌)

ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడు దూవి శ్రీ‌ప్ర‌సాద్ (పుష్ప ది రైజ్‌)

ఉత్త‌మ గేయ‌ర‌చ‌యిత : సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి (జాను)

ఉత్త‌మ నేప‌థ్య గాయ‌కుడు సిద్ శ్రీ‌రామ్ (పుష్ప ది రైజ్‌) శ్రీ‌వ‌ల్లి..

ఉత్త‌మ నేప‌థ్య గాయ‌ని ఇంద్రావ‌తి చౌహాన్ (పుష్ప ది రైజ్‌) ఊ అంటావా మావ‌..

ఉత్త‌మ కొరియోగ్రాఫ‌ర్ : శేఖ‌ర్ మాస్ట‌ర్ ( అల వైకుంఠ‌పుర‌ములో) రాములో రాములా..

ఉత్త‌మ సినిమాటోగ్రాఫ‌ర్ : మినోస్లా బ్రోజెక్ (పుష్ప ది రైజ్‌)

జీవిత‌కాల సాఫ‌ల్య పుర‌స్కారం : అల్లు అర‌వింద్‌.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.