Begin typing your search above and press return to search.

పుష్ప డ్యూయాల‌జీ బాహుబ‌లి అంత స‌స్పెన్స్ తో?

By:  Tupaki Desk   |   12 Jun 2021 6:30 AM GMT
పుష్ప డ్యూయాల‌జీ బాహుబ‌లి అంత స‌స్పెన్స్ తో?
X
బాహుబ‌లి 1 - బాహుబ‌లి 2 డ్యూయాల‌జీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న‌ ప్రేక్ష‌కాభిమానుల్ని మంత్ర‌ముగ్ధం చేసిన సంగ‌తి తెలిసిందే. మొద‌టి భాగం ముగింపులో క‌ట్ట‌ప్ప పాత్ర‌తో స‌స్పెన్స్ క్రియేట్ చేసి దానికి కొన‌సాగింపు భాగాన్ని స‌మ‌ర్థంగా తెర‌కెక్కించ‌డంలో ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి గొప్ప ప‌నితనం చూపించారు.

ఇప్పుడు సుకుమార్ కూడా అలాంటి మ్యాజిక్ చేయ‌నున్నారా? పుష్ప చిత్రాన్ని రెండు భాగాలుగా తెర‌కెక్కించాల‌న్న ఆయ‌న స్ట్రాట‌జీ వెన‌క ఉన్న అస‌లు రీజ‌న్ ఏమై ఉంటుంది? అన్న‌ది ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పుష్ప- 1 కి ముగింపు ఎలా ఉండ‌నుంది? ఆ ముగింపుతో సీక్వెల్ కొన‌సాగింపు ఉంటుందా? అన్న‌ది మ‌రో స‌స్పెన్స్.

తాజా స‌మాచారం మేర‌కు పుష్ప మొదటి భాగం షూటింగ్ ఈ జూలై లేదా ఆగస్టులో తిరిగి ప్రారంభమవుతుంది. పెండింగ్ షూటింగ్ ని ఒకే షెడ్యూల్ లో పూర్తి చేయాల‌న్న‌ది ప్లాన్. ఈ ఏడాది చివరి నాటికి ఈ చిత్రం రిలీజ‌వుతుంది. అలాగే పుష్ప డ్యూయాలజీ కోసం ఇప్ప‌టికే సుకుమార్ బౌండ్ స్క్రిప్ట్ ను లాక్ చేసాడు. అతను ఇటీవలే రెండో భాగం స్క్రిప్ట్ ప‌నుల్ని సంపూర్ణంగా పూర్తి చేశారు. పుష్ప -2 షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభించాలని నిర్మాత‌లు భావిస్తున్నారు. రెండవ పార్ట్ కేజీఎఫ్ 2 త‌ర‌హాలో అత్యంత భారీగా ఉంటుంద‌ని చెబుతున్నారు. గంధ‌పు చ‌క్క‌ల స్మ‌గ్ల‌ర్ క‌థాంశంతో రూపొందుతున్న ఈ డ్యూయాల‌జీపై జాతీయ స్థాయిలో క్యూరియాసిటీ నెల‌కొంది. బ‌న్ని ఇందులో డ్యూయ‌ల్ షేడ్ ఉన్న పాత్ర‌తో స‌ర్ ప్రైజ్ చేయ‌నున్నారు.