Begin typing your search above and press return to search.

బన్నీకి మళ్ళీ గ్యాప్ రానుందా...?

By:  Tupaki Desk   |   12 Sep 2020 1:00 PM GMT
బన్నీకి మళ్ళీ గ్యాప్ రానుందా...?
X
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో 'పుష్ప' అనే పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మరియు ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంలో బన్నీ మొరటు కుర్రాడిగా కనిపించడంతో పాటు చిత్తూరు యాసలో మాట్లాడబోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన 'పుష్ప' ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ ఎక్కువ భాగం అడవుల్లో జరుపుకోవాల్సి ఉంది. దీని కోసం కేరళ అడవుల్లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేయగా కరోనా మహమ్మారి బ్రేక్స్ వేసింది.

ఇదిలావుండగా ప్రభుత్వం షూటింగ్స్ కి అనుమతులు ఇవ్వడంతో ఇప్పుడిప్పుడే కొన్ని సినిమాలు సెట్స్ మీదకు వెళ్తున్నాయి. దీంతో 'పుష్ప' కూడా వచ్చే నెలలో షూటింగ్ స్టార్ట్ చేస్తుందంటూ వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో 'పుష్ప' టీమ్ మరొకొన్ని రోజులు వేచి చూడాలని డిసైడ్ అయిందట. అందులోనూ అడవుల్లో ఎక్కువ మంది సిబ్బందితో చిత్రీకరించాల్సి ఉంటుంది కాబట్టి షూటింగ్ స్టార్ట్ చేయడానికి మరో రెండు నెలల సమయమైనా పట్టే అవకాశం ఉందని అంటున్నారు. దేనిని బట్టి చూస్తే డిసెంబర్ చివర్లో"పుష్ప" అడవుల్లోకి వెళ్తాడాని తెలుస్తోంది. ఎప్పుడు స్టార్ట్ చేసినా సింగిల్ షెడ్యూల్ లోనే అనుకున్న షూట్ ను పూర్తి చేసేయాలని అనుకుంటున్నారట. మొత్తం మీద మరోసారి బన్నీ కావాలని గ్యాప్ తీసుకోకపోయినా చాలా గ్యాప్ వచ్చేలా కనిపిస్తోంది.