Begin typing your search above and press return to search.
పుష్ప స్పెషల్ పబ్లిసిటీ ప్లాన్స్
By: Tupaki Desk | 2 Oct 2021 5:31 AM GMTఅల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమా విడుదల తేదీ సమీపిస్తుంది. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసేందుకు గాను ప్లాన్ చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు.. అన్ని భాషల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా కథను మరియు స్క్రీన్ ప్లేను దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేశాడు. పాన్ ఇండియా మార్కెట్ కు పక్కా సూటబుల్ అంటూ యూనిట్ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు. కేజీఎఫ్ ను మించిన యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని చాలా నమ్మకంగా యూనిట్ సభ్యులు ప్రేక్షకులకు హామీ ఇస్తున్నారు. సినిమా ఎంత గొప్పగా చేసినా కూడా పబ్లిసిటీ చేయకుండా.. ప్రమోషన్స్ చేయకుండా ప్రేక్షకులు చూడాలంటే మాత్రం కష్టం. పుష్ప సినిమా కాస్టింగ్ నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులు సహజంగానే అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. విడుదల కోసం ఎదురు చూస్తున్న జనాలు ఎగబడి చూస్తారు. కాని పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలనుకుంటున్నారు కనుక ఇతర భాషల్లో సినిమాను ప్రమోట్ బాగా చేయాల్సి ఉంటుంది.
అల వైకుంఠపురంలో సినిమా తో బన్నీ.. రంగస్థలం సినిమాతో సుకుమార్ లు ఇండస్ట్రీ హిట్ కొట్టిన తర్వాత చేస్తున్న సినిమా పుష్ప కనుక తెలుగు లో ఈ సినిమా గురించి అస్సలు పబ్లిసిటీ అవసరం లేదు. కాని ఇతర భాషల్లో బన్నీ కాని సుకుమార్ కాని ఎక్కువ మార్కెట్ ను కలిగి లేరు అనేది టాక్. కేరళలో బన్నీ సినిమాను జనాలు ఆధరిస్తారు. కాని ఉత్తరాదిన మరియు తమిళ కన్నడ ఇండస్ట్రీల్లో సినిమాను ఆధరిస్తారా లేదా అనేది అనుమానంగా ఉంది. సినిమా ఎలా ఉన్నా మొదట సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి క్రియేట్ చేయగలిగితే థియేటర్లకు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఉత్తరాదిన విడుదలకు నెల రోజుల ముందు నుండే పెద్ద ఎత్తున పబ్లిసిటీ కార్యక్రమాలు చేయాలని భావిస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని కూడా భావిస్తున్నారు. ఉత్తరాదిన ఈమద్య కాలంలో సౌత్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది.
ఆ డిమాండ్ ను ఉపయోగించుకోవాలంటే అక్కడ జనాల్లో సినిమా గురించి చర్చ జరిగేలా చేయాలి. అప్పుడే సినిమాను అక్కడ జనాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. బన్నీ గతంలో నటించిన పలు సినిమాలు హిందీలో డబ్ అయ్యి శాటిలైట్ ద్వారా యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులను అలరించారు. ఆ గుర్తింపు అక్కడ బన్నీకి ఉంది. కాని ఆయన పుష్ప సినిమా ను థియేటర్లలో విడుదల చేయబోతున్నారు కనుక టీవీలు యూట్యూబ్ లో బన్నీని చూసి అభిమానించిన వారిని థియేటర్ల వరకు రప్పించగలగాలి. అందుకు పుష్ప ప్రమోషన్స్ పీక్స్ లో ఉండాలి. అందుకే నెల రోజుల ముందు నుండే పుష్ప పబ్లిసిటీ కోసం సన్నాహాలు చేస్తున్నారు.
పుష్ప పబ్లిసిటీ కోసం ముంబయిలో అయిదుగురు సభ్యులతో ఒక టీమ్ కూడా ఫామ్ అయ్యిందని.. వారు అన్ని ప్లాట్ ఫామ్స్ ల్లో పుష్ప గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు ప్లాన్స్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. పబ్లిసిటీ కోసం కాస్త ఎక్కువ ఖర్చు పెట్టినా కూడా పుష్ప కు ఖచ్చితంగా రిటర్న్స్ ఉంటాయనే నమ్మకంను యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. పుష్ప చిత్రీకరణ ఈ నెల చివరి వరకు ముగించే అవకాశాలు ఉన్నాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే డిసెంబర్ లో సినిమాను విడుదల చేయాలనే పట్టుదలతో సుకుమార్ ఉన్నాడు. రికార్డు బ్రేకింగ్ వసూళ్లను పుష్ప దక్కించుకుంటుందనే నమ్మకంతో అంతా ఉన్నారు. పుష్ప రెండు పార్ట్ లుగా రాబోతున్న నేపథ్యంలో మొదటి పార్ట్ షూటింగ్ పూర్తి అయ్యి విడుదల అయిన తర్వాత మూడు నాలుగు నెలల గ్యాప్ తీసుకుని మళ్లీ పుష్ప 2 ను పునః ప్రారంభించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.