Begin typing your search above and press return to search.

గందరగోళంలో 'పుష్ప' శ్రీవల్లి కెరీర్‌!

By:  Tupaki Desk   |   16 Dec 2022 4:33 AM GMT
గందరగోళంలో పుష్ప శ్రీవల్లి కెరీర్‌!
X
పుష్ప సినిమా తో పాన్ ఇండియా స్థాయిలో హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ రష్మిక మందన్నా. ఈ అమ్మడు బాలీవుడ్‌.. కోలీవుడ్‌.. టాలీవుడ్‌.. శాండిల్‌ వుడ్‌ ఇలా అన్ని భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉందంటూ మొన్నటి వరకు అనుకున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కాంతార సినిమా విషయంలో కన్నడం లో అనధికారికంగా రష్మిక పై బ్యాన్ కొనసాగుతుందనే వార్తలు వస్తున్నాయి.

కన్నడం లో చాలా కాలంగా రష్మిక మందన్నా సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.. ఇప్పుడు వారే రష్మికను వద్దు అనుకుంటున్నారు అనే ప్రచారం జరుగుతోంది. ఇక కోలీవుడ్‌ లో విజయ్ కి జోడీగా వారసుడు సినిమాలో నటించింది. ఆ సినిమా సక్సెస్ అయితే తమిళనాట ఆమె జోరు కంటిన్యూ అవ్వబోతుంది. లేదంటే మాత్రం ఆమె కు తమిళ్ లో ఆఫర్లు లేనట్లే.

ఇక తెలుగు లో పుష్ప సూపర్‌ హిట్‌ అయినా కూడా చిన్న సినిమాలకు నో చెప్పడం వల్ల.. భారీ పారితోషికం డిమాండ్‌ చేయడం వల్ల పుష్ప 2 సినిమా మాత్రమే ఆమె చేతిలో ఉంది. ఇక హిందీపై ఎక్కువ ఆశలు పెట్టుకున్న ఈ కన్నడ శ్రీవల్లి తీవ్రంగా నిరాశకు గురి అయ్యింది. రష్మిక మందన్నా హిందీలో నటించిన రెండు సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.

గుడ్‌ బై సినిమా థియేటర్ రిలీజ్ అయ్యి నిరాశ పర్చగా మరో సినిమా మిషన్ మజ్ను కనీసం థియేటర్ రిలీజ్ కూడా కాకుండా ఓటీటీ లో విడుదల అయ్యి పెద్దగా కనిపించకుండానే పోయింది. ఇప్పుడు హిందీలో ఈమె చేస్తున్నది ఒకే ఒక్క సినిమా యానిమల్‌.

రణబీర్‌ కపూర్‌ కు జోడీగా సందీప్ వంగ దర్శకత్వంలో యానిమల్‌ సినిమాలో రష్మిక మందన్నా నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా వచ్చే ఏడాది లో విడుదల కాబోతుంది. యానిమల్‌ సక్సెస్ అయితే తప్ప బాలీవుడ్‌ లో ఈ అమ్మడికి ఆఫర్లు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

ఇక టాలీవుడ్‌ లో కూడా పుష్ప 2 తర్వాత మాత్రమే ఆఫర్లు వస్తాయి అంటున్నారు. మొత్తానికి ఈ అమ్మడి కెరీర్‌ కాస్త ఇబ్బందుల్లో పడ్డట్లు అయ్యింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. గత ఏడాది బిజీ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న రష్మిక ఇప్పుడు ఏం సినిమాలు చేస్తుంది అంటే ఠక్కున సమాధానం చెప్పడానికి లేకుండా పోయింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.