Begin typing your search above and press return to search.

'పుష్ప‌'ని ముందు అలా తీయాల‌నుకున్నార‌ట‌

By:  Tupaki Desk   |   19 Dec 2021 10:30 AM GMT
పుష్ప‌ని ముందు అలా తీయాల‌నుకున్నార‌ట‌
X
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ న‌టించిన చిత్రం `పుష్ప‌`. సుకుమార్ తెర‌కెక్కించిన ఈ మూవీ ఈ శుక్ర‌వారం విడుద‌లై వ‌ర‌ల్డ్ వైడ్‌గా వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తున్న విష‌య‌మం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ప‌లు మీడియా సంస్థ‌ల‌తో ముచ్చ‌టించిన స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ఈ సంద‌ర్భంగా ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల్ని వెల్ల‌డించారు. `పుష్ప : ది రైజ్‌`కి ల‌భిస్తున్న స్పంద‌న చూసి ఆనందంగా వుంద‌న్న సుకుమార్ ఈ సినిమా రిలీజ్ పై.. సినిమా మేకింగ్ పై చెప్పిన అంశాలు ప‌లువురిని షాక్ కి గురిచేస్తున్నాయి. ఈ చిత్రాన్ని ముందు వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి లేదా వేస‌విలో విడుద‌ల చేయాల‌ని భావించార‌ట‌.

కానీ క‌రోనా భ‌యాల వ‌ల్ల ఈ నెల 17న విడుద‌ల చేయాల్సి వ‌చ్చింద‌న్నారు. దీంతో రిలీజ్ టైమ్ చాలా త‌క్కువగా వుండ‌టంతో చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొన్నార‌ట‌. అంతే కాకుండా బాక్సాఫీస్ నంబ‌ర్స్‌ని దృష్టిలో పెట్టుకుని ప‌ని చేశామ‌ని ఈ సంద‌ర్భంగా సుక్కు చెప్పుకొచ్చారు. అయితే ఈ సంద‌ర్భంగా సుకుమార్ చెప్పిన ఓ విష‌యం బ‌న్నీ అభిమానుల‌తో పాటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌ని కూడా విస్మ‌యానికి గురిచేసింది. ముందు ఈ సినిమాని వెబ్ సిరీస్ గా తీయాల‌నుకున్నాన‌ని కానీ ఆ త‌రువాత సినిమాగా అనుకున్నామ‌ని అది రెండు పార్ట్ లు గా మారింద‌ని సుకుమార్ షాకింగ్ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు.

`పుష్ప :ది రైజ్‌` లో ఓ సాధార‌ణ కూలి వాడు స్మ‌గ్లింగ్ సిండికేట్ నే శాసించే స్థాయికి ఎలా వెళ్లాడ‌న్న‌దాన్ని చూపించాం. అయితే ఆ పాత్ర అలా ఎందుకు వుంది? .. అత‌ని చిన్న‌త‌నం ఎలా సాగింది?.. ఎదుర్కొన్న సంఘ‌ట‌న‌లు, అవ‌మానాలేంటీ? పుష్ప అలా ఎందుకు మారాడు అనేవి సెకండ్ పార్ట్ లో చూపించ‌బోతున్నాం. అని తెలిపారు సుక్కు. పుష్ప‌రాజ్ పాత్ర కోసం అల్లు అర్జున్ చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. చిత్తూరు యాస నేర్చుకున్నాడు. సెట్స్‌లో తోటి న‌టీన‌టులను కూడా ఇన్ స్పైర్ చేసేవాడు. నా సినిమాల్లో కొన్ని రియ‌ల్ లైఫ్ క్యారెక్ట‌ర్ల రిఫ‌రెన్స్ లు ఉంటాయి. ఈ సినిమాలో కూడా ఉన్నాయి. రావు ర‌మేష్ వంటి వారు ఇండ‌స్ట్రీలో వుండ‌టం మ‌న అదృష్టం. ఆయ‌న ఎలాంటి పాత్ర‌లైనా చేయ‌గ‌ల‌రు. సునీల్ మంగ‌ళం శీనుగా, అన‌సూయ (దాక్షాయ‌ణి) పాత్ర‌కు రెండో పార్ట్ లో మంచి ప్రాధాన్యం ఉంటుందట‌.

పుష్ప క్లైమాక్స్ గురించి మాట‌లు వినిపించాయి. కానీ ఆ క్లైమాక్స్ ఎందుకు అలా వుందో.., ఫాహ‌ద్ ఫాజిల్ పాత్ర ప్ర‌త్యేక‌త ఏంట‌న్న‌ది పార్ట్ 2లో తెలుస్తుంది. ఫ‌స్ట్ పార్ట్‌లో వున్న క్యారెక్ట‌ర్స్ సెకండ్ పార్ట్ లోనూ కంటిన్యూ అవుతాయి. కొత్త‌గా ఒక‌టి రెండు పాత్ర‌లు క‌నిపిస్తాయంతే. హిందీలో ప్ర‌మోట్ చేయ‌లేక‌పోయామ‌ని రాజ‌మౌళి తిడుతున్నారు. స‌మ‌యాభావం వల్లే అక్క‌డ ప్ర‌చారం చేయ‌లేక‌పోయాం. ఇక ఇందులో ప్ర‌త్యేక గీతంలో న‌టించ‌డానికి ముందు స‌మంత అంగీక‌రించ‌లేద‌ని, కానీ నేనే ఆమెని ఒప్పించాను. మ‌హేష్ బాబుకు చెప్పిన క‌థ ఇది కాదు. `పుష్ప‌` 2 త‌రువాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సినిమా చేస్తా. ఆర్య 3 గురించి భ‌విష్య‌త్తులో ఆలోచిస్తా` అని ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు సుకుమార్‌.