Begin typing your search above and press return to search.
బన్నీ ఫ్యాన్స్ కి 'పుష్ప' టీమ్ గుడ్ న్యూస్!
By: Tupaki Desk | 11 July 2022 11:30 AM GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'పుష్ప ది రైజ్'. స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ భారీ స్థాయిలో గత ఏడాది డిసెంబర్ లో విడుదలై అనూహ్య విజయాన్ని సాధించింది. పాన్ ఇండియా వైడ్ గా రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టడమే కాకుండా బన్నీని పాన్ ఇండియా స్టార్ ని చేసింది. పార్ట్ 1 దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో ఈ మూవీకి ఫ్రాంచైజీగా రానున్న పార్ట్ 2 పై సర్వత్రా అంచనాలు మొదలయ్యాయి.
'కేజీఎఫ్ 2' సంచలన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని 'పుష్ప 2' స్క్రిప్ట్ విషయంలో భారీ మార్పులు చేశారట. బడ్జెట్ ని కూడా భారీగా పెంచేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే సెకండ్ పార్ట్ కు దాదాపు గా 400 కోట్లు ఖర్చు చేయబోతున్నారట. మరిన్ని ప్రత్యేక పాత్రలని పార్ట్ 2 కోసం జత చేస్తూ స్క్రిప్ట్ లో దర్శకుడు సుకుమార్ మార్పులు చేశారని తెలుస్తోంది. ఫస్ట్ పార్ట్ కోసం మిస్సయిన విజయ్ సేతుపతి ని సెకండ్ పార్ట్ కోసం తీసుకొస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
ఈ ఏడాది ప్రారంభం లోనే పార్ట్ 2 ప్రారంభం అవుతుందని భావించి ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ లో మార్పుల కారణంగా ఆలస్యం అవుతూ వస్తోంది. జూన్ లో స్టార్ట్ అన్నారు. అది కాస్తా జూలైకి మారిందని వార్తలు వినిపించాయి.
కానీ ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఆగస్టులో ప్రారంభం కానుందని తెలుస్తోంది. సుకుమార్ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ని పూర్తి చేశారట. ఆగస్టు మూడవ వారంలో 'పుష్ప ది రూల్' షూటింగ్ ని ప్రారంభించబోతున్నారని తెలిసింది. గత కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్ట్ ఎప్పెడెప్పుడు మొదలవుతుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి ఇది నిజంగా గుడ్ న్యూసే.
రెగ్యులర్ షూటింగ్ కి టైమ్ ని లాక్ చేసిన దర్శకుడు సుకుమార్ లొకేషన్స్ ని కూడా ఫైనల్ చేశారని, ఫస్ట్ పార్ట్ కి అదిరిపోయే ట్యూన్స్ అందించిన దేవి శ్రీప్రసాద్ పార్ట్ 2 కోసం కూడా ట్యూన్స్ ని సిద్ధం చేసేశాడని తెలుస్తోంది. ప్రస్తుతం హీరో బన్నీ, దర్శకుడు సుకుమార్ స్క్రిప్ట్ కి సంబంధించిన చర్చలలో పాల్గొంటున్నారట. ఇదిలా వుంటే రష్మిక పాత్రపై గత కొన్ని రోజులుగా రక రకాల వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆసరక్తికర వార్త ఒకటి బయటికి వచ్చింది.
ఇందులోనూ రష్మిక పాత్ర కొనసాగుతుందని, అల్లు అర్జున్ భార్య పాత్రలో రష్మిక కనిపిస్తుందని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో మరింత స్పెషల్ గా తెరపైకి రానున్న ఈ మూవీని వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నరట. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన నటీనటుల ఎంపిక కూడా పూర్తయినట్టుగా చెబుతున్నారు. షూటింగ్ ప్రారంభానికి ముందే భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ మూవీకి బాలీవుడ్ కు చెందిన పలు క్రేజీ సంస్థలు భారీ ఆఫర్లు ఇస్తున్నారట. అయితే మైత్రీ వారు మాత్రం షేర్ విధానంలోనే ఈ మూవీని బాలీవుడ్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.