Begin typing your search above and press return to search.
రష్యాని సైతం షేక్ చేసేలా 'పుష్ప'?
By: Tupaki Desk | 20 Sep 2022 7:30 AM GMT'పుష్ప' పాన్ ఇండియాలో ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. ఇండియానే షేక్ చేసిన చిత్రంగా నిలిచింది. అన్ని భాషల్లోనూ సినిమా భారీ వసూళ్లను సాధించింది. హిందీ బెల్ట్ లో ఎవరు చూస్తారు? ఈ సినిమా అని విమర్శించిన నోళ్లే ప్రశంసించాయి. ఉత్తరాది మార్కెట్ లో భారీ వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా ఖ్యాతికెక్కింది.
ఇలా అన్ని రకాలుగా పుష్ప రిలీజ్ తర్వాత పెను సంచలనమే అయింది. అలాగే వరల్డ్ వైడ్ పుష్పరాజ్ మ్యానరిజమ్...శ్రీవల్లి సాంగ్ ఎంతగా ఫేమస్ అయిందన్నది చెప్పాల్సిన పనిలేదు. విదేశీ క్రికెటర్లే రీల్స్ చేసే స్థాయిలో ఆకట్టుకుంది. 'పుష్ప' పై గ్రూవింగ్ నెట్టింట ఓ సంచలనమే రేపింది. అలాగే అంతర్జాతీయ వేదికలపైనా 'పుష్ప' సత్తా చాటడం మొదలు పెట్టింది.
ఇప్పటికే మాస్కో అంతర్జాతీయ ఫిలిమ్స్ పెస్టివల్స్ లో ప్రదర్శింపబడింది. తెలుగు..ఇంగ్లీష్ ..రష్యన్ సబ్ టైటిల్స్ తో ప్రదర్శింపబడిన చిత్రం ఆద్యంతం జ్యూరీని ఆకట్టుకుంది. వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్స్ విభాగంలో ప్రదర్శింబడిన విషయాన్ని ఇండియన్ ఎంబసీ ఎంతో గర్వంగా చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో పుష్ప మొదటి భాగాన్ని రష్యా భాషలో అనువదించి రిలీజ్ చేస్తున్నట్లు సుకుమార్ రివీల్ చేసారు.
ఫిల్మ్ పెస్టివల్స్ లో వచ్చిన ప్రదర్శనని ఆధారంగా చేసుకుని ప్రేక్షకులు ముచ్చే గొప్ప చిత్రంగా నిలుస్తుందన్న ధీమాతో సుకుమార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో బాహుబలి సినిమాని సైతం వివిధ భాషల్లో ఇలాగే రిలీజ్ చేసారు. అంతర్జాతీయ వేదికలపై ఆ చిత్రానికి వచ్చిన గుర్తింపుని గ్రహించి రాజమౌళి కొన్ని ప్రత్యేక దేశాల్లోనూ చిత్రాన్ని రిలీజ్ చేసి సక్సెస్ అందుకున్నారు.
అదే తరహా స్ర్టాటజీతో ఇప్పుడు సుకుమార్ ముందుకెళ్తున్నారు. రష్యాలో వచ్చిన రెస్పాన్స్ ని ఆధారంగా చేసుకుని మరికొన్ని దేశాల్లోనూ రిలీజ్ చేసే అవకాశం లేకపోలేదు. ఇండియాలోనే సైలెంట్ గా రిలీజ్ అయి వైలెంట్ గా హిట్ అందుకున్న సినిమా ఇది. నార్త్ లో ఎలాంటి ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించకుండానే కోట్ల కనక వర్షం కురిపించింది.
మరి విదేశాల్లోనూ ఆ మార్క్ సక్సెస్ అందుకుంటుందా? లేదా? అన్నది చూడాలి. ప్రస్తుతం పుష్ప రెండవ భాగం కోసం దేశ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సంగతి తెలిసిందే. మొదటి భాగాన్ని మించి రెండవ భాగం ఉండేలా? దర్శకుడు సుకుమార్ స్ర్కిప్ట్ దశలోనే చాలా వర్క్ చేసారు. అభిమానులు అంచనాలు మించి ఉంటుందని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.