Begin typing your search above and press return to search.

పుష్ప‌రాజ్ సెట్లోకి అడుగుపెట్టేది అప్పుడేనా?

By:  Tupaki Desk   |   12 Oct 2022 10:34 AM GMT
పుష్ప‌రాజ్ సెట్లోకి అడుగుపెట్టేది అప్పుడేనా?
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ గా నిల‌బెట్టిన యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ 'పుష్ప ది రైజ్‌'. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ గా సంచ‌ల‌నాలు సృష్టించ‌డ‌మే కాకుండా ఊహించ‌ని విధంగా రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబట్టి ఉత్త‌రాది వారిని, బాలీవుడ్ వ‌ర్గాల‌ని విస్మాయినికి గురిచేసింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్ గా రానున్న 'పుష్ప 2'పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

ఫ‌స్ట్ పార్ట్ సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకోవ‌డంతో పార్ట్ 2ని మ‌రిన్ని ప్ర‌త్యేక‌త‌ల‌తో ఊహించ‌ని విధంగా అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మించాల‌ని అల‌క‌లు అర్జున్‌, ద‌ర్శ‌కుడు సుకుమార్‌, మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు ప్లాన్ చేశారు. ఇందు కోసం ఏకంగా రూ. 350 కోట్ల‌కు మించి బ‌డ్జెట్ ని కేటాయించారు. ఈ నేప‌థ్యంలో 'పుష్ప 2' ఎప్పుడెప్పుడు మొద‌ల‌వుతుందా? అని అభిమానుల‌తో పాటు సినీ ల‌వ‌ర్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇటీవ‌లే ఈ మూవీకి సంబంధించిన పూజా కార్య‌క్ర‌మాల్ని లాంఛ‌నంగా పూర్తి చేశారు. అయితే రెగ్యుల‌ర్ షూటింగ్ విష‌యంలో మాత్రం ఇంకా మేక‌ర్స్ కి క్లారిటీ రాలేద‌నే కామెంట్ లు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. స్వ‌ర్గీయ ప‌ద్మ‌శ్రీ అల్లు రామ‌లింగ‌య్య జ‌యంతి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 1న అల్లు స్టూడియోస్ ని అల్లు ఫ్యామిలీ ప్రారంభించిన విష‌యం తెలిసిందే. అదే రోజున అల్లు స్టూడియోస్ లో అట్ట‌హాసంగా 'పుష్ప 2' రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌ల‌వుతుందని అంతా భావించారు.

దీనిపై పెద్ద‌గా ప్ర‌చారం కూడా జ‌రిగింది. ఆ త‌రువాత అక్టోబ‌ర్ 10 నుంచి మొద‌లవ్వొచ్చ‌నే వార్త‌లు వినిపించాయి. కానీ జ‌ర‌గ‌లేదు. తాజాగా ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ని దీపావ‌ళి త‌రువాత మొద‌లు పెట్టే అవ‌కాశం వుంద‌ని తెలుస్తోంది. మేక‌ర్స్ కూడా ఇదే చెబుతున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అల్లు స్టూడియో ఓపెనింగ్‌.. ఆ త‌రువాత ద‌స‌రా రావ‌డం.. ఆ వెంట‌నే ఫిల్మ్ ఫేర్ వేడుక‌ల్లో 'పుష్ప‌' టీమ్ పాల్గొని ఏకంగా ఏడు అవార్డుల్ని ద‌క్కించుకోవ‌డంతో ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ కి అంత‌రాయం ఏర్ప‌డింది.

అంతే కాకుండా 'పుష్ప‌' ఊహించ‌ని విధంగా భారీ విజ‌యాన్ని సాధించ‌డం.. ఆ త‌రువాత వ‌చ్చిన 'RRR', 'కేజీఎఫ్‌2' రికార్డు స్థాయి విజ‌యాన్ని ద‌క్కించుకోవ‌డంతో 'పుష్ప 2' విష‌యంలో ద‌ర్శ‌కుడు సుకుమార్‌, బ‌న్నీల ప్లాన్ మారింది. పార్ట్ 2 ని ఇంట‌ర్నేష‌న‌ల్ స్టాండ‌ర్డ్స్ లో తెర‌పైకి తీసుకురావాల‌ని ప్లాన్ మార్చుకున్నారు. ఆ కార‌ణంగానే సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఆల‌స్యం అవుతూ వ‌స్తోంద‌ని తెలుస్తోంది.

ఎట్ట‌కేల‌కు ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ని దీపావ‌ళి త‌రువాత ప్రారంభించ‌నున్నార‌ట‌. కీల‌క ఘ‌ట్టాల కోసం విదేశాలు కూడా వెళ్ల‌నున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ మూవీ కోసం హైద‌రాబాద్ లో ప‌లు భారీ సెట్ ల‌ని నిర్మిస్తున్నార‌ట‌. ఇటీవ‌లే బ‌న్నీ లుక్ టెస్ట్ ని కూడా పూర్తి చేసిన విష‌యం తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.