Begin typing your search above and press return to search.

దుబాయ్ నేచుర్ లోనే పుష్ప‌రాజ్ సంతోషాల‌న్నీ!

By:  Tupaki Desk   |   28 Jan 2022 5:30 AM GMT
దుబాయ్ నేచుర్ లోనే పుష్ప‌రాజ్ సంతోషాల‌న్నీ!
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ `పుష్ప ది రైజ్` స‌క్సెస్ ని అస్వాదిస్తోన్న స‌మ‌య‌మిది. తొలిపాన్ ఇండియా స‌క్సెస్ ని ద‌క్కించుకుని రెట్టించిన ఉత్సాహంలో ఉన్నాడు. హిందీలో సైతం సినిమా పెద్ద విజ‌యం సాధించడంతో బ‌న్నీ ఆనందానికి అవుదుల్లేవ్. బాలీవుడ్ నుంచి ఊహించ‌ని స‌క్సెస్ బ‌న్నీకి ద‌క్కింది. బాలీవుడ్ సెల‌బ్రిటీలే బ‌న్నీ న‌ట‌న‌ని ప్ర‌శంసించి ట్వీట్లు చేయ‌డం కొస‌మెరుపు. హిందీ లో స్ర్టెయిట్ సినిమా కాక‌పోయినా ఈ రేంజ్ లో ప్ర‌శంస‌లు ద‌క్క‌డం అంటే అందంతా బ‌న్నీ-సుకుమార్ గొప్ప‌త‌నంగానే చెప్పాలి. ఈ సక్సెస్ బ‌న్నీ ఆలోచ‌న‌ల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. న‌టుడిగా మ‌రింత షైన్ అయ్యాడు.

అప్ క‌మింగ్ ప్రాజెక్ట్ ల‌కు సంబంధించి ఓ ప్ర‌ణాళిక సిద్ద‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం బ‌న్నీ కుటుంబ స‌మేతంగా దుబాయ్ టూర్ లో ఉన్నాడు. పుష్ప క‌ష్టాన్ని..సుఖాల్నా దుబాయ్ నేచుర్ తో పంచుకుంటున్నాడు. స్కైపూల్ నుంచి దుబాయ్ స్కైలైన్ యొక్క అద్భుత‌మైన వీక్ష‌ణ‌ను ఆస్వాదిస్తోన్న ఫోటో ఒక‌టి ఇన్ స్టా లో షేర్ చేసాడు. ఎత్తైన భ‌వనం నుంచి అస‌లైన దుబాయ్ అందాల్ని ఆస్వాదిస్తున్నాడు. నిజంగా ఇది ఎంతో బ్యూటీఫుల్ గా క‌నిపిస్తోంది. ఈ ఫోటో కోసం బ‌న్నీ వైట్ టీ ష‌ర్ట్..బ్లాక్ ప్యాంట్ ధ‌రించి ఉండ‌గా..వెనుక నుంచి క్యాప్చ‌ర్ తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది.

ఇక బ‌న్నీ దుబాయ్ టూర్ అనంత‌రం రెండ‌వ భాగం `పుష్ప ది రూల్` షూటింగ్ లో బిజీ కానున్నారు. మ‌రోవైపు థ‌ర్డ్ వేవ్ కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో షూటింగ్ బ‌న్నీ షూటింగ్ బ‌రిలోకి దిగే విష‌యంలో అస్ప‌ష్ట‌త ఉంది. మ‌రో నెల రోజుల పాటు షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి జాయిన్ అవుతారా? లేక ఫిబ్ర‌వ‌రి నుంచి టీమ్ తో జాయిన్ అవుతారా? అన్న దానిపై క్లారిటీ లేదు. అలాగే కొత్త ప్రాజెక్ట్ ల‌పైనా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.