Begin typing your search above and press return to search.
సోషల్ మీడియాలో పుష్పారాజ్.. స్టోరీ వైరల్!
By: Tupaki Desk | 30 April 2021 9:35 AM GMTటాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మొదలైనప్పటి నుండి వార్తల్లో హాట్ టాపిక్ అవుతూనే ఉంది. అందుకు తగ్గట్టుగానే మేకర్స్ కూడా సినిమా నుండి అప్పుడప్పుడు అప్డేట్స్, పోస్టర్స్ రిలీజ్ చేస్తూనే ఉన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా గురించి తాజాగా పలు కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి హీరో గురించా లేక హీరోయిన్ దర్శకుడు గురించా అనుకుంటే పొరపాటే. పుష్ప స్టోరీ గురించి సోషల్ మీడియాలో కథనాలు ఊహగానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి సినిమా కథ ఎలా ఉండబోతుందో కానీ ఈ రూమర్స్ మాత్రం జనాలను బాగానే అట్ట్రాక్ట్ చేస్తున్నాయి.
అయితే తాజాగా పుష్ప సినిమా కథ.. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన విలన్ సినిమాకు కాపీ అని.. ఆ సినిమా కథనే స్ఫూర్తిగా తీసుకొని పుష్ప తెరకెక్కిస్తున్నారని టాక్ నడుస్తుంది. నిజానికి విలన్ సినిమా రామాయణం ఆధారంగా రావణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెరకెక్కించారు. చెల్లిని చంపిన విలన్ ను హీరో ఎలా ఎదుర్కొన్నాడు అనేది కాన్సెప్ట్. మరి ఈ సినిమాలో కూడా పుష్పారాజ్ కు చెల్లి ఉంటుందని ఇదివరకే మేకర్స్ తెలిపారు. కానీ ఆ చెల్లి క్యారెక్టర్ ఐశ్వర్యరాజేష్ పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి ఈ సినిమాలో సుకుమార్ ఎలాంటి మ్యాజిక్ చూపిస్తాడో.. మరి నిజంగానే మణిరత్నం సినిమాను కాపీ కొట్టారా లేదా అనేది తెలియాలంటే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుత సమాచారం ప్రకారం.. విలన్ మూవీకి పుష్ప కథకు ఎలాంటి పోలిక లేదని సినీవర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి రూమర్స్ చూసి సుకుమార్ టీమ్ నవ్వుకుంటున్నారట. ఈ సినిమాను మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్నారు.