Begin typing your search above and press return to search.
పక్కా ప్లానింగ్ తో పుష్పరాజ్ రంగంలోకి!
By: Tupaki Desk | 22 Aug 2022 7:44 AM GMTRRR, కేజీఎఫ్ 2 సినిమాల తరువాత యావత్ దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్నక్రేజీ మూవీ 'పుష్ప ది రూల్'. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ మూవీ పాన్ ఇండియా వండర్ గా నిలిచింది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో మైత్రీ మూవీ మేకర్స్, ముత్యం శెట్టి మీడియా సంయుక్తంగా అత్యంత భారీ స్థాయిలో నిర్మించిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఐదు భాషల్లో విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ మూవీ సైలెంట్ గా విడుదలై ఉత్తరాదిలో రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టింది.
గత ఏడాది డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ ఉత్తరాదిలో పెద్దగా ప్రచారం చేయలేకపోయినా కేవలం మౌత్ టాక్ తో భారీ వసూళ్లని రాబట్టి బాలీవుడ్ వర్గాలని విస్మయానికి గురిచేసింది. ఈ నేపథ్యంలో పార్ట్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పార్ట్ 1 సాధించిన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు సుకుమార్ పార్ట్ 2లో భారీ మార్పులు చేశారట. మరిన్ని ప్రత్యేకతలతో తెరపైకి రానున్న ఈ మూవీ ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా? అని ఫ్యాన్స్ తో పాటు సగటు సినీ ప్రేక్షకుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు.
పార్ట్ 1 కి మించి అంచనాలు నెలకొనడంతో పార్ట్ 2ని మరింత కేర్ గా భారీ ప్రత్యేకతలతో దెరపైకి తీసుకురావాలని దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే రెండు నెలల క్రితమే ప్రారంభం కావాల్సిన ఈ మూవీని ఆలస్యంగా పట్టాలెక్కించబోతున్నాడు. స్క్రిప్ట్ అనుకున్న విధంగా పూర్తవడంతో ఈ మూవీకి ఎట్టకేలకు సోమవారం ఆగస్టు 22న లాంఛనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన్న మినహా చిత్ర బృందం పాల్గొంది. బన్నీ ప్రస్తుతం అమెరికాలో వున్నాడు. ఆ కారణంగానే ఓపెనింగ్ సెర్మనీలో పాల్గొనలేకపోయాడు. తరువాత మంచి ముహూర్తాలు లేకపోవడంతో మేకర్స్ సోమవారం లాంఛనంగా పూజా కార్యక్రమాలని పూర్తి చేశారు.
సెప్టెంబర్ ద్వితీయార్థం నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలిసింది. పార్ట్ 1 విషయంలో కొంత షూటింగ్ పరంగానూ, రిలీజ్ విషయంలోనూ మేకర్స్, డైరెక్టర్ ఎలాంటి ప్లానింగ్ లేకుండా హరీ బరీగా వ్యవహరించారు.
అయితే పార్ట్ 2 విషయంలో అలా జరగకుండా ముందే పక్కాగా ప్లాన్ వేసుకుని రంగంలోకి దిగుతున్నారట. ఏ విషయంలోనూ తొందర పడకుండా చాలా కూల్ గా పార్ట్ 2ని అనుకున్నది అనుకున్నట్టుగా తెరపైకి తీసుకురావాలని, అదే విధంగా చాలా కూల్ గా సినిమాని రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. పక్కా ప్లాన్ తో వచ్చే ఏడాది జూన్ వరకు షూటింగ్ పూర్తి చేసి దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నారట.