Begin typing your search above and press return to search.

పుష్ప‌రాజ్ ప్యావ‌రెట్ స్టిల్ ఇదే

By:  Tupaki Desk   |   8 Jan 2022 11:30 AM GMT
పుష్ప‌రాజ్ ప్యావ‌రెట్ స్టిల్ ఇదే
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన `పుష్ప దిరైజ్` ఇటీవ‌ల విడుద‌లై ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో తెలిసిందే. బ‌న్నీ కెరీర్ లో తొలి పాన్ ఇండియా స‌క్సెస్ ఇది. దీంతో బ‌న్నీ రెట్టించిన ఉత్సాహంలో ఉన్నాడు. ఇక ఇందులో బ‌న్నీ గంద‌పు చెక్క‌ల స్మ‌గ్ల‌ర్ పుష్ప‌రాజ్ పాత్ర‌లో ఒదిగిపోయిన విధానం గురించి అయితే చెప్పాల్సిన ప‌నిలేదు. చిత్తూరు మాండ‌లీకంలో ..పుష్ప‌రాజ్ మాస్ పాత్ర‌కు ప్రాణ ప్ర‌తిష్ట చేసాడు. అంత అద్భుంగా ఆ పాత్ర‌లో న‌టించాడు. ఇక లుక్ ప‌రంగా బ‌న్నీని మాస్ ర‌గ్గ‌డ్ లుక్ లో చాలా చ‌క్క‌గా డిజైన్ చేసారు. ఊర మాస్ పాత్ర ఆహార్యం బ‌న్నీకి స‌రిగ్గా యాప్ట్ అయింది.

బ‌న్నీ ఆహార్యం చూసిన త‌ర్వాత ఆ పాత్ర‌కు తాను త‌ప్ప ఇంకెవ్వ‌రు న్యాయం చేయ‌రేమో అనిపిచింది. ఆ ఆహార్యం.. న‌ట‌న పుష్ప రాజ్ పాత్ర‌ని ఆ రేంజ్ లో నిల‌బెట్టాయి. ఇందులో బ‌న్నీకి సంబంధించిన ప్ర‌తీ స్టిల్ ఎంతో మాసివ్ లుక్ లో ఆక‌ట్టుకుంది. `పుష్ప` రాజ్ గా బ‌న్నీని మెచ్చ‌ని...న‌చ్చ‌ని వారు? అంటూ ఎవ‌రూ ఉండ‌ద‌రు. మ‌రి బ‌న్నీకి సినిమాలో బాగా న‌చ్చిన స్టిల్ ఏది? అంటే ఓ ఫోటోని ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేసి ఇదే నా అభిమాన స్టిల్ అని చెప్ప‌క‌నే చెప్పారు. ఈ స్టిల్ లో బ‌న్నీ నోట్లో బిడీ పెట్టుకుని తాగుతున్నాడు. గుబురుగా పెరిగిన క‌ర్లీ హెయిర్..ముఖంపై..ష‌ర్ట్ పై ద‌ట్ట‌మైన‌ మ‌ట్టి తో మాస్ లుక్ లో ఆక‌ట్టుకుంటున్నాడు. ఈ ఫోటో బ‌న్నీకి ప్యావ‌రెట్ పిక్ అని తెలిపారు.

ఇంకా `పుష్ప` రెండ‌వ భాగం కూడా ఉంది. మార్చిలో ఆ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఇందులో బ‌న్నీ ఇంకెత మాస్ గా చూపిస్తారు? అన్న‌ది తెలియాలి. అయితే పుష్ప‌రాజ్ ని రెండ‌వ భాగంలో ధ‌న‌వంతుడిగా చూపించ‌డాని ఆ ఆస్కారం. గంద‌పు దుంగ‌ల సిండికేట్ వ్య‌వ‌హారం హెడ్ బాధ్య‌త‌ల్ని పుష్ప‌రాజ్ కే అప్ప‌గించారు. దీంతో మంగ‌ళం శ్రీను స‌హా కొన్ని పాత్ర‌ల వెయిట్ త‌గ్గింది. క్లైమాక్స్ లో పోలీస్ ఆఫీప‌ర్ పాత్ర పోషించిన ఫ‌హ‌ద్ పాజిల్ పాత్ర‌తోనే ముగించారు. రెండ‌వ భాగం ఈ రెండు పాత్ర‌ల మ‌ధ్య త‌గ్గాఫ్ వార్ న‌డుస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.