Begin typing your search above and press return to search.

పుష్ప‌రాజ్ - సుకుమార్ స్పెష‌ల్ మీటింగ్స్‌

By:  Tupaki Desk   |   12 Jan 2022 3:30 AM GMT
పుష్ప‌రాజ్ - సుకుమార్ స్పెష‌ల్ మీటింగ్స్‌
X
బ‌న్నీ - సుకుమార్ ల కాంబినేష‌న్ కి ఓ ప్ర‌త్యేక‌త వుంది. గ‌తంలో వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన ఆర్య‌, ఆర్య 2 చిత్రాలు వీరి కెరీర్‌లో ప్ర‌త్యేక‌మైన చిత్రాలుగా నిలిచాయి. ఈ రెండు చిత్రాల త‌రువాత ముచ్చ‌ట‌గా మూడ‌వ‌సారి వీరిద్ద‌రూ క‌లిసి చేసిన పాన్ ఇండియా మూవీ `పుష్ప ది రైజ్‌`. గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ఓ సామ‌న్య‌మైన కూలివాడు సిండికేట్ కి ఎలా బాస‌య్యాడు? ఆ సామ్రాజ్యాన్ని ఎలా త‌న హ‌స్త‌గ‌తం చేసుకున్నాడ‌న్న‌ది చాలా చ‌క్క‌గా చూపించారు.

దీంతో ఈ మూవీ దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నాలు సృష్టిస్తూ వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. ఊహించ‌ని విధంగా `పుష్ప‌` స‌క్సెస్ కావ‌డం, ద‌క్షిణాదితో పాటు ఉత్త‌రాదిలోనూ ఈ మూవీకి ఊహించ‌ని స్థాయ‌లో క్రేజ్ పెర‌గ‌డం తెలిసిందే. ఈ మూవీ కోసం ఉత్త‌రాదిలో ప్ర‌చారం కూడా చేయ‌లేదు అయినా అక్క‌డ `పుష్ప‌` సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. ఈ నేప‌థ్యంలో స‌క్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న `పుష్ప` టీమ్ పార్ 2 ఏర్పాట్లులో మునిగిపోతున్నారు.

ద‌ర్శ‌కుడు సుకుమార్‌, హీరో బ‌న్నీ `పుష్ప ది రూల్‌` పై ఫోక‌స్ పెట్టారు. స్క్రిప్ట్ లో మార్పులు పూర్తయితే ఫిబ్ర‌వ‌రి లేదా మార్చిలో సెట్స్ పైకి వెళ్లాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. పార్ట్ 1కి వ‌స్తున్న అప్లాజ్‌, విమ‌ర్శ‌ల‌ని బేరీజు వేసుకుని పార్ట్ 2 లో మార్పులు చేస్తున్నార‌ట‌. గ‌త కొంత కాలంగా సుకుమార్ త‌నకు అత్యంత స‌న్నిహితంగా వుండే వారు త‌న సినిమాల‌పై చేసే విమ‌ర్శ‌ల‌ని ప‌క్కాగా ఫాలో అవుతుంటార‌ట‌. తాజాగా పార్ట్ 2 విష‌యంలోనూ వారితో చ‌ర్చించి వారి స‌ల‌హాల‌ని తీసుకున్న త‌రువాత `పుష్ప 2` ఫైన‌ల్ డ్రాఫ్ట్ ని సిద్ధం చేయాల‌ని సుకుమార్ భావిస్తున్నార‌ట‌.

బ‌న్నీతో కూడా ఈ విష‌యంపై సుకుమార్ స్పెష‌ల్ గా మీటింగ్స్ జ‌రుపుతున్నార‌ట‌. `పుష్ప ది రూల్‌` బేసిక్ ప్లాట్ ని అలాగే వుంచి సీన్ ల‌లో భారీ మార్పులు చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ముందు అనుకున్న విధంగా కాకుండా ప్ర‌తీ సీన్ ఊహించ‌ని విధంగ‌టా వుండేలా ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది. యాక్ష‌న్ బ్లాక్స్ తో పాటు ర‌ష్మిక , బ‌న్నీల మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు చాలా కొత్త‌గా వుంటాయ‌ని, ఇవే సినిమాకు ప్ర‌ధాన హైలైట్స్ గా నిలుస్తాయ‌ని తెలుస్తోంది.

అంతే కాకుండా తొలి పార్ట్ తో పోలిస్తే సెకండ్ పార్ట్ లో యాక్ష‌న్ స‌న్నివేశాల‌కు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని, ఊహించ‌ని విధంగా యాక్ష‌న్ స‌న్నివేశాలు వుండాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. బడ్జెట్ ప‌రంగా కూడా ఇద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. పార్ట్ 1 తో ఓ సామాన్యుడు అసామాన్యుడిగా ఎదిగిన క్ర‌మాన్ని చూపించారు. పార్ట్ 2 లో అంత‌కు మించి చూపించ‌బోతున్నార‌ట‌. ఇక ఫిబ్ర‌వ‌రి నుంచే దేవి ట్యూన్ ల‌ని సిద్ధం చేసే ప‌నిని మొద‌లుపెట్ట‌బోతున్నాడ‌ట‌. ఈ సారి ఆడియో మ‌రింత హైలైట్‌గా వుండే అవ‌కాశాలు వున్నాయ‌ని చెబుతున్నారు.