Begin typing your search above and press return to search.

అక్టోబర్ వైపుగా పుష్పారాజ్.. ప్లాన్ చేంజ్ చేస్తున్నాడా??

By:  Tupaki Desk   |   11 May 2021 2:30 PM GMT
అక్టోబర్ వైపుగా పుష్పారాజ్.. ప్లాన్ చేంజ్ చేస్తున్నాడా??
X
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ మూడో కాంబినేషన్ లో పాన్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. పుష్ప అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే కరోనా కారణంగా నిలిచిపోయింది. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి చెందుతుండటంతో అలాగే హీరో అల్లు అర్జున్ కరోనా బారినపడటంతో సినిమా షూటింగ్ ప్రస్తుతానికి బ్రేక్ లో ఉంది. అదిగాక ఇండస్ట్రీ అంతా షూటింగ్స్ నిలిపేసి పోస్ట్ ప్రొడక్షన్ - ఎడిటింగ్ లాంటి పనులు చూసుకుంటున్నారు. ప్రస్తుతం పుష్ప టీమ్ కూడా అదేపనిలో ఉందట. అయితే కరోనా బారినపడిన హీరో అల్లు అర్జున్ ఇటీవలే కోలుకున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం పుష్ప టీమ్ అందరూ ప్రస్తుతం ఐసొలేషన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పుష్ప షూటింగ్ 60% కంప్లీట్ అయినట్లు పలు మీడియా కథనాలు చెబుతున్నాయి. ఈ సినిమాతో అల్లు అర్జున్ లోని మరో కోణాన్ని బయటపెడతా అంటున్నాడు డైరెక్టర్. ఓ రఫ్ అండ్ రియలిస్టిక్ పల్లెటూరు కుర్రాడి లుక్కులో కనిపించనున్నాడు అల్లు అర్జున్. ఇప్పటికే పుష్ప నుండి విడుదలైన పుష్పారాజ్ ఇంట్రడక్షన్ టీజర్ యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేసింది. అలాగే సినిమా తగ్గేదేలే అంటూ అంచనాకు కూడా పెంచేసింది. 60మిలియన్స్ పైగా వ్యూస్ తో 1.4మిలియన్స్ లైక్స్ తో పుష్ప ట్రెండింగ్ లో ఉంది.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోహీరోయిన్స్ రాయలసీమ - చిత్తూరు యాసలో మాట్లాడబోతున్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా రిమైనింగ్ షూటింగ్ గురించి ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే పుష్ప షూటింగ్ మరో నెల పాటు బాలన్స్ ఉందని టాక్. అలాగే సినిమాను ఆగష్టులో రిలీజ్ చేయాలని అనుకున్నారట. కానీ కరోనా కారణంగా షూట్ ఆలస్యం అవుతుండటంతో సినిమాను అక్టోబర్ నెలలో రిలీజ్ కాబోతుందని సమాచారం. ఈ సినిమాలో అల్లు అర్జున్ జోడిగా రష్మిక మందన నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ వారు సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.