Begin typing your search above and press return to search.

పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న సౌత్ ఇండస్ట్రీ ఫస్ట్ ఆంథాలజీ సిరీస్...!

By:  Tupaki Desk   |   16 Oct 2020 11:30 PM GMT
పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న సౌత్ ఇండస్ట్రీ ఫస్ట్ ఆంథాలజీ సిరీస్...!
X
తమిళంలో ఐదు లఘు చిత్రాల సంకలనం ''పుతం పుదు కలై'' అనే ఆంథాలజీ సిరీస్ రూపొందిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈరోజు (అక్టోబర్ 16) నుంచి స్ట్రీమింగ్ కి పెట్టారు. ఐదుగురు అగ్ర దర్శకులు కలిసి ఐదు వేర్వేరు కథలను ఒకే ఇతివృత్తంలో అల్లిన ఈ సిరీస్ కు ఓటీటీ ఆడియన్స్ మరియు విమర్శకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ప్రేమ - కొత్త ప్రారంభాలు - సెకండ్ ఛాన్స్ - ఆశ నేపథ్యంలో స్టార్ డైరెక్టర్లు గౌతమ్ వాసుదేవ్ మీనన్ - కార్తీక్ సుబ్బరాజు - రాజీవ్ మీనన్ - సుధ కొంగర - సుహాసిని మణిరత్నం కలిసి ఈ ఆంథాలజీ క్రియేట్ చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ సిరీస్ షూటింగ్ కంప్లీట్ చేశారు. బాలీవుడ్ లో నలుగురు ఐదుగురు దర్శకులు కలిసి ఓ ఆంథాలజీ సిరీస్ ని తెరకెక్కిస్తున్నట్లే ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో కూడా ఈ ఫార్ములా సక్సెస్ అయిందనే చెప్పాలి. ముఖ్యంగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ - కార్తీక్ సుబ్బరాజు - సుధ కొంగర డైరెక్ట్ చేసిన షార్ట్ స్టోరీస్ బాగా ఆకట్టుకుంటున్నాయని తెలుస్తోంది.

కాగా, ''పుతం పుదు కలై'' ఆంథాలజీలో బాబీ సింహా - జయరామ్ - శృతిహాసన్ - ఆండ్రియా - కళ్యాణి ప్రియదర్శన్ - రీతూ వర్మ - సుహాసిని మణిరత్నం - అను హాసన్ - ఊర్వశి - కాళిదాస్ జయరామ్ - సిక్కుల్ గురుచరణ్ - ఎంఎస్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ ని మణిరత్నం - సుహాసిని మణిరత్నం - రాజీవ్ మీనన్ - కార్తీక్ సుబ్బరాజ్ - ఫ్రాన్సిస్ థామస్ - శ్రుతి రామచంద్రన్ - ఆదిత్య కేఆర్ - రేష్మా ఘటాలా - కృష్ణస్వామి రామ్‌ కుమార్ రచించారు. జీవీ ప్రకాష్ సంగీతం అందించారు. మీనాక్షి సినిమాస్ - లయన్ టూత్ స్టూడియోస్ - మద్రాస్ టాకీస్ - రాజీవ్ మీనన్ ప్రొడక్షన్స్ - స్టోన్ బెంచ్ నిర్మాణ సంస్థలు నిర్మించాయి. సౌత్ ఇండస్ట్రీలోనే తొలిసారిగా చేసిన ఈ ప్రయోగాత్మక ఫిల్మ్ మంచి అనుభూతిని కలిగించడంతో రాబోయే రోజుల్లో మరిన్ని ఆంథాలజీలు రూపొందే అవకాశం ఉంది.