Begin typing your search above and press return to search.

నిన్న క‌వ‌ర్ పేజీపై అలా.. నేడేమో ఇలా!

By:  Tupaki Desk   |   10 Oct 2019 4:12 PM GMT
నిన్న క‌వ‌ర్ పేజీపై అలా.. నేడేమో ఇలా!
X
బ్యాడ్మింట‌న్ స్టార్ పీవీ సింధు ప్ర‌తిభ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. 6 అడుగుల ఈ ట్యాలెంటెడ్ ప్లేయ‌ర్ ఇటీవ‌ల ఆట‌తో పాటు గ్లామ‌ర్ కోణంలోనూ త‌న‌ని తాను ఎలివేట్ చేసుకోవ‌డం యూత్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆట‌తో వ‌చ్చే ఆదాయాన్ని మించి వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల‌తో ఆర్జించే వెసులుబాటు ఉండ‌డంతో రెండు మార్గాల్ని విడిచి పెట్ట‌డం లేదు. ఓవైపు దేశం కోసం ఆడుతూ రాణిస్తోంది. మ‌రోవైపు త‌న పాపులారిటీని యాడ్ స‌ర్కిల్స్ లో పెంచుకుంటోంది. అంద‌రు స్పోర్ట్స్ స్టార్స్ లానే మిలియ‌న్ డాల‌ర్ ప్ర‌క‌ట‌న‌ల రెవెన్యూని బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఆర్జిస్తోంది.

లేటెస్ట్ గా ప్ర‌ఖ్యాత ఫెమీనా క‌వ‌ర్ పేజీపై పీవీ సింధు గ్లామ‌ర‌స్ గా క‌నిపించింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక‌తో పోటీప‌డుతూ క‌వ‌ర్ పేజీపై హైలైట్ గా నిలిచింది. ఇంత‌కుముందు ప్ర‌ఖ్యాత జేఎఫ్ డ‌బ్ల్యూ క‌వ‌ర్ పేజీ స‌హా ప‌లు స్పోర్ట్స్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీల‌పైనా సింధు అంతే స్పెష‌ల్ గా క‌నిపించింది. అయితే వీట‌న్నిటికీ భిన్నంగా బ‌తుక‌మ్మ సంబ‌రాల్లో పీవీ సింధు చీర‌క‌ట్టుతో క‌నిపిస్తూ యూత్ లో టాక్ ఆఫ్ ది టౌన్ అవుతోంది. గ‌త ఏడాది పీవీ సింధు చీర‌లో బ‌తుక‌మ్మ సంబ‌రాలు చేసుకుంది. ఈసారి కూడా ఎంతో సాంప్ర‌దాయ‌బ‌ద్ధంగా తళుక్కుమంది. తాజాగా ఓ దేవాల‌యంలో ద‌ర్శ‌నానికి వెళ్లి త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి స‌రికొత్త లుక్ లో క‌నిపించింది. తెల్ల రంగు చీర‌.. ప‌చ్చ ర‌వికె కాంబినేష‌న్ తో ఆక‌ట్టుకుంది. దీనికి ప‌చ్చ‌లు పొదిగిన హారం ధ‌రించి ఆక‌ట్టుకుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు ఫ్యాన్స్ లో వైర‌ల్ అవుతున్నాయి.

పీవీ సింధు ట్రాక్ రికార్డ్ ప‌రిశీలిస్తే.. ఒలింపిక్ 2016 రజత పతక విజేతగా పీవీ సింధుకి అద్భుత‌మైన ఫాలోయింగ్ ఉంది. ఇటీవ‌ల‌ స్విట్జర్లాండ్‌ బాసెల్‌లో జరిగిన బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం సాధించిన తొలి భారతీయురాలిగా సింధు సంచ‌ల‌నం సృష్టించాక త‌న ఇమేజ్ ఇంకా పెరిగింది. 25 ఏళ్ల షట్లర్ 2018 మహిళల ఆసియా సింగిల్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారతదేశానికి తొలి ఆసియా క్రీడల రజత పతకాన్ని సాధించి పెట్టింది. గ్లాస్గోలో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల సింగిల్స్ ఫైనల్‌లో ఆమె మూడో పతకాన్ని కూడా గెలుచుకుంది. కొరియా సూపర్ సిరీస్ టైటిల్ గెలుచుకున్న మొదటి భారతీయ క్రీడాకారిణిగానూ చ‌రిత్ర లిఖించింది. ఫోర్బ్స్ 2019 వరల్డ్స్ హై-పెయిడ్ ఫీమేల్ అథ్లెట్ల జాబితాలో కూడా ఉన్నారు. ఆట‌లోనే కాదు బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల‌లోనూ బిగ్ స్కోర‌ర్ గానే నిలుస్తోంది.