Begin typing your search above and press return to search.
సిల్వర్ స్టార్ కాదు.. గోల్డెన్ గర్ల్
By: Tupaki Desk | 17 Dec 2018 10:43 AM GMTరెండేళ్ల కిందట రియో ఒలింపిక్స్ లో అద్భుత ప్రదర్శన చేసి దేశవ్యాప్తంగా తిరుగులేని అభిమానం సంపాదించుకుంది తెలుగమ్మాయి పి.వి.సింధు. ఫైనల్లో పోరాడి ఓడి రజతంతో సరిపెట్టుకున్న ఆమెను దేశం ‘సిల్వర్ స్టార్’ అంటూ కీర్తించింది. స్వర్ణం కోల్పోయిందని ఆమె నిరుత్సాహ పడకుండా ఆమె స్వర్ణం గెలిచిన స్థాయిలోనే సంబరాలు చేసుకున్నారు జనాలు. ఐతే అప్పటికి మామూలుగా ‘సిల్వర్ స్టార్’ అని కితాబిచ్చారు కానీ.. విచిత్రంగా తర్వాతి కాలంలో అది ఆమెకు నెగెటివ్ అయింది. ఆ తర్వాత పలు టోర్నీల్లో సింధు ఫైనల్లో ఓడిపోవడం మొదలుపెట్టింది. ఫైనల్స్ వరకు బాగా ఆడుకుంటూ వచ్చి.. చివరి పోరులో బోల్తా కొట్టడం సింధుకు అలవాటుగా మారిపోయింది. కొన్నిసార్లు విజయానికి చేరువగా వెళ్లి కూడా ఓటమి చవిచూసింది.
దీంతో సింధును ‘సిల్వర్ స్టార్’ అంటూ ఎద్దేవా చేయడం మొదలుపెట్టారు జనాలు. సింధు ఏ టోర్నీలో గొప్పగా ఆడి ఫైనల్ చేరినా.. ఇక స్వర్ణం రాదన్న నిరుత్సాహంలోకి వెళ్లిపోతున్నారు జనాలు. తాజాగా ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీలోనూ సింధు తుది పోరుకు అర్హత సాధించగా.. జనాలు ముందే రజతానికి మానసికంగా సిద్ధపడిపోయారు. పైగా ఆమె తలపడింది జపాన్ స్టార్ ఒకహురతో. ఆమె చేతుల్లోనే రెండుసార్లు ఫైనల్ ఓడింది సింధు. దీంతో అంచనాలు మరిత తగ్గిపోయాయి. కానీ అంచనాల్ని తలకిందులు చేస్తూ సింధు ఈ మ్యాచ్ లో విజేతగా నిలిచింది. అద్భుత ఆట తీరును ప్రదర్శిస్తూ తుది పోరు లో సింధు 21-19, 21-17తో ఒకహుర ను ఓడించింది. దీంతో సింధు కు ఉన్న ‘సిల్వర్ స్టార్’ అనే ఇబ్బందికర బిరుదు తొలగిపోయింది. ఇక ఆమె ను గోల్డెన్ గర్ల్ సింధు అని పిలుస్తారేమో జనాలు.