Begin typing your search above and press return to search.

అంతా వాళ్లే చేశారంటున్న పీవీపీ

By:  Tupaki Desk   |   28 May 2016 6:32 AM GMT
అంతా వాళ్లే చేశారంటున్న పీవీపీ
X
సహజంగా నిర్మాతలు తమ సినిమా సంగతులను చాలా గుట్టుగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. సినిమా సరిగా ఆడకపోయినా హిట్ అని చెప్పడం, షూటింగ్ టైంలో గొడవలను దాచిపెట్టడం వంటివి చేయడం తప్పనిసరి. ఇలా చేయకపోతే ఉన్న కాసింత మంచి పేరు ఎక్కడ పోతుందో అనే టెన్షన్ ఉంటుంది. భారీ చిత్రాల నిర్మాత పీవీపీ కూడా ఇన్నేళ్లూ ఇదే చేశాడు. ఇప్పుడు మాత్రం రూట్ మార్చేశాడు.

ఊపిరి చిత్రం సక్సెస్ అనిపించుకుని కూడా 20 కోట్లకు బ్యాండ్ పడ్డం - బ్రహ్మోత్సవంతో భారీ స్థాయిలో నష్టాలను భర్తీ చేయాల్సి రావడం.. పీవీపీ బరస్ట్ అవడానికి కారణం అంటున్నారు. మూవీ ఫెయిల్యూర్ కి తాను అనుకుంటున్న కారణాలను కూడా మీడియా వాళ్లకు చెప్పేస్తున్నాడీయన. తనతో సినిమాలు చేసిన దర్శకులపై నేరుగానే ఆరోపణలు చేస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

'ఒక్కోళ్లకి విపరీతమైన ఇగో - బడ్జెట్ ప్లానింగ్ ఏమీ ఉండదు. కనీసం డబ్బు మీద గౌరవం ఉండదు. ఇలాంటి వాళ్ల కారణంగానే ఇండస్ట్రీ ఇలా తయారైంది' అని అంటున్నాడు పీవీపీ. ఈ నిర్మాత నిర్మొహమాటంగా చేస్తున్న కామెంట్స్.. ఇండస్ట్రీ జనాలను కొంచెం కంగారు పెడుతున్నాయి. అయితే.. బ్రహ్మోత్సవం అంటూ డిజాస్టర్ ను తీసినపుడు ఈమాత్రం ఫ్రస్టేషన్ ఉండడం సహజమే అనే కామెంట్స్ కూడా వినపడుతున్నాయి.